E-Paper
Advertisement

Hyderabad : ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా రైల్వే లైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..

Hyderabad : ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా రైల్వే లైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..
Advertisement

Hyderabad news telugu(Telangana today news):దేశంలోనే తొలిసారి తెలంగాణలో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. RRR రోడ్డుకు సమాంతరంగా ఈ రైల్వే ట్రాక్ నిర్మాణం ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. 320 కిలో మీటర్ల పరిధిలో హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న పలు జిల్లాలను కలుపుకొని నిర్మాణం ఉంటుందని చెప్పారు. అయితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటన కొత్త వివాదానికి ఆజ్యం పోసింది.

రీజినల్ రింగ్ రోడ్డు పై వివాదాలు పూర్తిగా ముగియక మునుపే.. మరో కొత్త వివాదం మొదలైంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా.. 340కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల రీజినల్ రింగ్ రోడ్డును రాష్ట్రానికి కేటాయించింది. దీనికి సుమారు 16వేల కోట్లు అవసరంకాగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరోసగం భరించాలి. అయితే ఇందులో సుమారు 5వేల 500 కోట్ల రూపాయలు ఒక్క భూసేకరణ కోసమే ఖర్చవుతోంది.

Advertisement

రీజినల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. అనేక ప్రాంతాల్లో భూములిచ్చేందుకు స్థానికులు నిరాకరించడంతో.. వారిని బుజ్జగించి భూమిని సేకరించడం అధికారులకు తలకుమించిన భారమైంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ భూ సేకరణ పూర్తికాలేదు. అయితే ఇప్పుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రకటించారు. దీంతో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ చర్చనీయాంశమైంది. తక్షణమే భూసేకరణ జరపాలని రైల్వే అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి స్థానిక రైతులు భూములు అప్పగిస్తారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×