E-Paper
Advertisement

congress : మారిన సమీకరణాలు.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెదిరేనా?

congress : మారిన సమీకరణాలు.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెదిరేనా?
Advertisement

రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఏర్పాటు కాబోతున్నది. ఇప్పటికే పార్టీ పేరు సైతం బయటకు రివీల్ అయ్యింది. అయితే, శ్రీరామనవమి రోజున ప్రకటన ఉంటుందని అంతా భావించగా అనుకోండా వచ్చే నెలకు పోస్ట్ పోన్ అయ్యింది. ఏప్రిల్ 25వ తేదీన మునీరాబాద్‌లో కొత్త పార్టీ పేరు ప్రకటన, జెండా ఆవిష్కరణ, ఎజెండాను ప్రకటిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత ఇప్పటికే ప్రకటించారు. దీనికి తోడు చాలా మంది బీఆర్ఎస్ నేతలు తనకు టచ్‌లో ఉన్నారని ప్రకటించారు.కవిత వ్యాఖ్యలపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కవిత పార్టీ పెట్టడం కంటే ఇప్పుడు ఉన్న జాతీయ పార్టీల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటే బెటర్ అని ప్రచారం జరుగుతోంది. ఎందుకుంటే మొన్నటివరకు కవితను బీఆర్ఎస్ పార్టీ నాయకురాలిగానే గుర్తించారని.. ఇప్పుడు కూడా అదే ప్రజలు అలాగే తీసుకుంటే ఆమె కొత్త పార్టీ పెట్టినా ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చని సమాచారం.

బీఆర్ఎస్ నేతలు వస్తారా?

రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఇక్కడ ఆ పార్టీ డామినేషన్ కామన్. అయితే, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పోటీపడుతున్నాయి. అందుకే అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ఆ రెండు పార్టీలు సన్నద్ధమయ్యాయి.ప్రభుత్వ పథకాలు, పాలసీల మీద తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దీంతో సీఎం రేవంత్ సైతం వారి ఆరోపణలు, విమర్శలకు కౌంటర్లు ఇవ్వాలని సంబంధిత మంత్రులు, విప్‌‌లను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇకపోతే కవిత కొత్త పార్టీ రాకతో గులాబీ పార్టీలో అసంతృప్తితో ఉన్నవాళ్లంతా తనతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించింది.నిజంగానే బీఆర్ఎస్ నేతలు కవిత పార్టీలో చేరుతారా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉన్నది.

ప్రభావం ఎంత?

Advertisement

కవిత కొత్తపార్టీ ప్రారంభించడం మూలంగా తమకు ఏమీ ఇబ్బంది ఉండబోదని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టవచ్చని, ఎక్కడ నుంచి అయినా పోటీ చేయవచ్చని కూడా గుర్తుచేశారు. పార్టీ పెట్టడం గొప్పకాదని, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లాలని, ఎవరైతే ఓటర్లను మెప్పిస్తారో వారికే ప్రజలు పట్టం కడతారని అన్నారు.ఇక కవిత పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. కవిత పార్టీతో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా నష్టం ఏమీ లేదని ఆయన వివరించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉందన్నారు. ఇదే విషయాన్ని మిగతా పార్టీ నేతలు సైతం చెబుతున్నారు.

BSNL IPL Plan: జియో హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 ఫ్రీ.. బిఎస్ఎన్ఎల్ ఐపిఎల్ ధమాకా ప్లాన్ లాంచ్

Advertisement

రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంఎల్ , తెలంగాణ జనసమితి, ఎంఐఎం పార్టీలు ఉన్నాయి. ఒక్కో పార్టీకి తమకంటూ సొంత ఓటింగ్ శాతం ఉన్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన ఓటింగ్ పర్సంటేజీ ఉన్నది. కాగా, కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచే ఉన్నది. ఈ పార్టీ ఫాలోవర్స్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్నారు. అందుకే ఆ పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదిరే అవకాశం లేదని కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కవిత కొత్త పార్టీ పెట్టాక జనాదరణ లేకపోతే ఆమె కూడా మరో వైఎస్ షర్మిల వలే యూటర్న్ తీసుకోవాల్సి వస్తుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవాలనేది మాత్రం ప్రజలే డిసైడ్ చేయనున్నారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×