E-Paper
Advertisement

Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్.. పలువురికి గాయాలు

Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్.. పలువురికి గాయాలు
Advertisement

Charminar Express: నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. స్టేషన్ లో రైలు పట్టాలు తప్పడంతో.. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. పట్టాలు తప్పిన రైలు ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీ కొన్నట్లు అధికారులు తెలిపారు. మూడు బోగీలు పక్కకు ఒరిగిపోవడంతో ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదంలో మరికొందరికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు.

చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ రైలు నాంపల్లి స్టేషన్ లో ఆగేందుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. రైలు స్లోగా రన్ అవ్వడంతో పెనుప్రమాదమే తప్పిందని అధికారులు అంటున్నారు. మరోవైపు దక్షిణమధ్య రైల్వే చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై స్పందించింది. రైలు దాదాపు స్టేషన్ లోకి ఎంటరవ్వడంతోనే చాలా మంది ప్రయాణికులు దిగేశారని తెలిపింది. కొందరు ప్రయాణికులు గాయపడ్డారని, వారికి చికిత్స చేస్తున్నారని తెలిపారు. కాగా.. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను తెలుసుకునేందుకు రైల్వే అధికారులు రైలును, పట్టాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

nampally railway station, charminar express accident

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×