BigTV English

Chicken Price: కొండెక్కిన కోడి.. నాన్ వెజ్ తినేదెలా ?

Chicken Price: కొండెక్కిన కోడి.. నాన్ వెజ్ తినేదెలా ?

Chicken Price: ఆదివారం వస్తే.. నాన్ ఉండాల్సిందే. చాలామందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. అందులోనూ చికెన్ మాత్రం మస్ట్ గా ఉండాల్సిందే. మరి మటన్ ?అంటారా అది బడ్జెట్ పై ఆధారపడి ఉంటుంది. సండే నాన్ వెజ్ కావాలంటే.. ఫ్రెండ్లీ బడ్జెట్ లో దొరికేది చికెన్ మాత్రమే. ఇప్పుడు దాని ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. కిలో చికెన్ ధర ఒక్కసారిగా రూ.100-150 వరకూ పెరిగింది. కార్తీకమాసంలో దాదాపు నాన్ వెజ్ కు బ్రేక్ ఇస్తారు కాబట్టి ధరలు తగ్గాయి. కిలో చికెన్ రూ.150-180కే అమ్మారు వ్యాపారులు. కార్తీక మాసం ముగిసింది. చికెన్ ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి.


కార్తీక మాసం పూర్తయ్యాక వచ్చిన మొదటి ఆదివారం.. చికెన్ సెంటర్లకు వెళ్లిన వినియోగదారులకు అక్కడి ధరలు షాకిచ్చాయి. కిలో చినెక్ ధర ఏకంగా రూ.220-240 కి పెరిగింది. కొన్ని సంస్థలైతే రూ.250-280 వరకూ విక్రయిస్తున్నాయి. ఆన్ లైన్ డెలివరీ అయితే కిలో చికెన్ ధర రూ.300 కూడా దాటేసింది. బాయిలర్ చికెన్ తో పాటు దేశీకోడి ధరలు కూడా ఎగబాకాయి.

కిలో చికెన్ పై రూ.100-150 వరకూ పెరగగా.. మటన్ కూడా అదే బాటలో ఉంది. కేజీ మటన్ ధర ప్రాంతాలను బట్టి రూ.800 నుంచి రూ.1000 వరకూ పలుకుతోంది. రానున్న రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు, సంక్రాంతితో పాటు పెళ్లిళ్ల ముహూర్తాలు కూడా ఉండటంతో చికెన్ కు డిమాండ్ పెరుగుతుంది. కాబోయే వేసవి వరకూ.. చికెన్ ధరలు ఇంతకన్నా పెరిగే అవకాశాలున్నట్లు విక్రయదారులు చెబుతున్నారు. మటన్ ఎలాగో కొనలేం. మరి చికెన్ ధరలు కూడా ఇలా ఉంటే.. నాన్ వెజ్ ఏం తింటామని సామాన్యులు వాపోతున్నారు.


Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×