BigTV English

IND vs SA 1st ODI : అందరి అంచనాలు తలకిందులు చేసిన తొలి వన్డే ‘పిచ్’

IND vs SA 1st ODI :  అందరి అంచనాలు తలకిందులు చేసిన తొలి వన్డే ‘పిచ్’
IND vs SA 1st ODI

IND vs SA 1st ODI : అదృష్టం బాగుండి టీమ్ ఇండియా కెప్టెన్ రాహుల్ సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టాస్ ఓడిపోయాడు  కానీ, లేకపోతే తను కూడా మొదట బ్యాటింగ్ తీసుకునేవాడని అతని మాటల ద్వారా తెలిసింది. ఇంతవరకు సౌతాఫ్రికా కెప్టెన్ మార్ క్రమ్ పొరపాటు పడ్డాడు.. బ్యాటింగ్ తీసుకుని తప్పు చేశాడని అంతా అనుకున్నారు.


స్పిన్ అనుకుంటే, పేస్ కి వికెట్లు పడ్డాయి: కేఎల్ రాహుల్

నిజానికి పిచ్ విషయంలో తనే కాదు, టీమ్ ఇండియా  కెప్టెన్ కూడా పొరపాటు పడ్డాడు. మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ మా ప్రణాళికలన్నీ తారుమారయ్యాయని అన్నాడు. మేం స్పిన్ బౌలింగ్ కి పిచ్ అనుకూలిస్తుందని అనుకున్నాం. కానీ పేసర్లు మ్యాచ్ ని తిప్పేశారని అన్నాడు.


బాల్ బాగా స్వింగ్ అవడంతో అర్షదీప్, ఆవేశ్ ఖాన్ ఇద్దరూ సౌతాఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టారని అన్నాడు. మేం అనుకున్నదొకటీ, అయినదొకటని తెలిపాడు. ఈ మాటలని బట్టి చూస్తే, ఒకవేళ తను టాస్ నెగ్గినా తొలుత  బ్యాటింగ్ తీసుకునేవాడు, అప్పుడు సౌతాఫ్రికా స్థానంలో టీమ్ ఇండియా ఉండేది. ఒకొక్కసారి అదృష్టం మన వైపుంటే టాస్ అటువైపు పడుతుందని నెట్టింట కామెంట్లు వినిపించాయి.

గ్రౌండ్ లోకి వెళ్లేవరకు తెలీలేదు: అర్షదీప్

అద్బుత బౌలింగ్ తో 5 వికెట్లు తీసిన అర్షదీప్ మాట్లాడుతూ  గ్రౌండ్ లోకి వెళ్లి బాల్ వేసేవరకు తెలీలేదని అన్నాడు. అప్పుడు బాల్ స్వింగ్ అవుతున్న విషయాన్ని గమనించామని అన్నాడు. దీంతో అప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చామని,  వికెట్ టు వికెట్ వ్యూహం అమలు చేశామని తెలిపాడు.

అది ఫలించి వెంటవెంటనే వికెట్లు పడ్డాయని సంతోషంగా తెలిపాడు. ఇంతవరకు నా పెర్ ఫార్మెన్స్ అనుకున్నంతగా సాగలేదు. 5 వికెట్ల ప్రదర్శనతో హ్యాపీగా ఉందని అన్నాడు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో బౌలింగ్ చేస్తానని అన్నాడు. నా బౌలింగ్ పై నమ్మకంతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగిందని అన్నాడు.

ఆరేడు ఓవర్లు జాగ్రత్తగా ఆడాలని అనుకున్నాం: సౌతాఫ్రికా కెప్టెన్ మార్ క్రమ్

నిజానికి టాస్ గెలిచిన తర్వాత మొదట బ్యాటింగ్ చేసి, భారీ స్కోర్ చేసి టీమ్ ఇండియా ముందు ఉంచాలని అనుకున్నాం. మొదట ఆరు నుంచి ఏడు ఓవర్లు జాగ్రత్తగా ఆడితే, ఆ తర్వాత నుంచి బ్యాటింగ్ కి అనుకూలిస్తుందని భావించాం. మా అంచనాలు తప్పాయి.  

బౌలింగ్ కి ఎక్కువ సేపు స్పందించింది. దాంతో నిలదొక్కుకోవడం కష్టమైందని అన్నాడు. అలాగే భారత పేసర్ల ప్రతిభని కొనియాడాడు. వారు సరైన ప్లేసులో బౌలింగ్ చేయడం వల్ల వికెట్లు పడ్డాయని చెప్పుకొచ్చాడు. కాకపోతే మా టీమ్ ఆత్మపరిశీలన చేసుకోవల్సిన సమయమని అన్నాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×