
Mallareddy latest news(Political news in telangana): కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్టు తమ కుటుంబం నుంచి 3 పదవులు ఉండాలని అనుకున్నామని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. పార్టీ అధినేత ఆదేశిస్తే.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు తమ కుమారుడు భద్రారెడ్డి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ఎంపీ టికెట్ కోసం సీఎం రేవంత్‌రెడ్డిని జగ్గారెడ్డి పొగుడుతున్నారని మల్లారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఫోకస్ కావడం కోసం తన పేరు ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు. తన పేరు చెప్పకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరన్నారు.
గతంలో రేవంత్‌రెడ్డిపై తాను చేసిన విమర్శలు అందరికీ గుర్తున్నాయని మల్లారెడ్డి తెలిపారు. గోవాలో తనకు హోటల్ ఉంది. రాజకీయాల నుంచి తప్పుకొంటే అక్కడికే వెళ్లి ఎంజాయ్ చేస్తానని ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. మనిషి జీవితం ఒకేసారి వస్తుందన్నారు. ప్రతి క్షణం జీవితాన్ని ఎంజాయ్ చేయాలని మల్లారెడ్డి పేర్కొన్నారు.