BigTV English

Ravindra Jadeja: ‘నా భార్య పేరు చెడగొట్టడానికే ఇవన్ని’.. తండ్రి ఆరోపణలపై రవీంద్ర జడేజా సీరియస్!

Ravindra Jadeja: ‘నా భార్య పేరు చెడగొట్టడానికే ఇవన్ని’.. తండ్రి ఆరోపణలపై రవీంద్ర జడేజా సీరియస్!

Ravindra Jadeja Serious on his Father Allegations: ఇటీవల రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్‌సిన్హ్ జడేజా గుజరాతీ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక ఆరోపణలు చేశాడు. దీనిపై రవీంద్ర జడేజా స్పందించాడు. తన తండ్రి చేసిన ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టారు. తన తండ్రి పాల్గొన్న ఇంటర్వ్యూ “స్టేజ్డ్” అని, “బేస్ లెస్” అని అభివర్ణించాడు. ఇది తన భార్య రివాబాను “పరువు తీయడానికి” చేసిన ప్రయత్నమని నొక్కి చెప్పాడు. “ఆర్కెస్ట్రేటెడ్ ఇంటర్వ్యూల కంటెంట్‌ను విస్మరించండి” అని జడేజా తన ట్విట్టర్ ఖాతాలో గుజరాతీలో సందేశాన్ని కలిగి ఉన్న గ్రాఫిక్‌కు క్యాప్షన్ ఇచ్చాడు.


“అర్ధంలేని ఇంటర్వ్యూలో చెప్పినవన్నీ అర్థరహితమైనవి, అవాస్తవమైనవి. ఇది వన్ సైడెడ్, ఈ ఆరోపణలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. నా భార్య ప్రతిష్టను దిగజార్చడానికి చేసిన ప్రయత్నాలు నిజంగా ఖండించదగినవి. నేను కూడా చాలా చెప్పాలి కానీ బహిరంగంగా చేయను” అని అంతర్జాతీయ క్రికెట్‌లో శుక్రవారం 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రవీంద్ర జడేజా అన్నారు.

అనిరుధ్‌సిన్హ్ తన కొడుకు చుట్టూ ఉన్న లైమ్‌లైట్‌కు దూరంగా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతాడని పంచుకున్నాడు. జామ్‌నగర్‌లో నివసిస్తున్నప్పటికీ, తన కుమారుడు రవీంద్రకు ఫామ్‌హౌస్ ఉందని తెలిసినా, అనిరుధ్‌సిన్హ్ 2BHK అపార్ట్‌మెంట్‌లో నివసించడానికి ఇష్టపడుతున్నట్లు ఇంటర్వూలో పేర్కొన్నాడు.

“నాకు మా గ్రామంలో కొంత భూమి ఉంది. నా భార్యకు వచ్చే ₹20,000 పెన్షన్ నుంచి నా ఖర్చులను నేను నిర్వహిస్తాను. నేను 2BHK ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్నాను. నాకు వంట చేసే ఒక ఇంటి పనివాడు ఉన్నాడు. నేను నా స్వంత నిబంధనలతో నా జీవితాన్ని గడుపుతున్నాను. నా 2BHK ఫ్లాట్‌లో కూడా రవీంద్ర కోసం ప్రత్యేక గది ఉంది.” అని అనిరుధ్‌సిన్హ్ తెలిపాడు.

Read More: ధోని జెర్సీ రిలీజ్.. చెన్నై ఫ్యాన్స్ హంగామా..

తనతో, అతని సోదరితో సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగించడంలో భారత క్రికెటర్ విఫలమయ్యాడని సీనియర్ జడేజా కూడా ఆరోపించాడు. “నేను రవీంద్రను సంప్రదించడం లేదు, నాకు అవసరం లేదు. అతను నా తండ్రి కాదు; నేను అతని తండ్రి. నాతో మాట్లాడటం అతని బాధ్యత. ఇవన్నీ నాకు కన్నీళ్లు తెప్పిస్తాయి. రక్షాబంధన్ సందర్భంగా అతని సోదరి కన్నీళ్లు పెట్టుకుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘రవీంద్రను క్రికెటర్‌గా నిలబెట్టేందుకు మేం చాలా కష్టపడ్డాం. డబ్బు సంపాదించేందుకు 20 లీటర్ల పాల డబ్బాలను భుజాన వేసుకుని వెళ్లేవాడిని. వాచ్‌మెన్‌గా కూడా పనిచేశాను. మేం నిరాడంబరమైన నేపథ్యం నుంచి వచ్చాం. అతని సోదరి అంతకంటే ఎక్కువ చేసింది. ఆమె అతనిని తల్లిలా చూసుకుంది. అయినా, అతను తన సోదరితో కూడా ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు.”

రివాబా కుటుంబంలో రవీంద్ర విభేదాలు సృష్టిస్తున్నారని అనిరుధ్‌సింగ్ ఆరోపించారు. “వారి వివాహం జరిగిన వెంటనే, రవీంద్ర రెస్టారెంట్ యాజమాన్యం గురించి వివాదం వచ్చింది. రెస్టారెంట్ యాజమాన్యాన్ని ఆమె పేరుకు బదిలీ చేయమని అతనితో చెప్పింది. దాని కారణంగా వారి మధ్య పెద్ద గొడవ కూడా జరిగింది. అతను బదిలీ చేస్తాడని అతని సోదరి భావించింది” అని అనిరుధ్‌సిన్హ్ జడేజా చెప్పాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×