BigTV English

KCR: అందుకే కరెంట్ డిపార్ట్‌మెంట్లో ఒక్క ఐఏఎస్‌ కూడా లేరు.. కేసీఆర్ చెప్పిన సీక్రెట్..

KCR: అందుకే కరెంట్ డిపార్ట్‌మెంట్లో ఒక్క ఐఏఎస్‌ కూడా లేరు.. కేసీఆర్ చెప్పిన సీక్రెట్..
kcr_electricity

KCR: సీఎం కేసీఆర్ ఇంట్రెస్టింగ్ మేటర్ చెప్పారు. గడిచిన పదేళ్లుగా కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఒక్కరంటే ఒక్క ఐఏఎస్‌ను కూడా నియమించలేదని చెప్పారు. అందుకో కారణం ఉందని సీక్రెట్ రివీల్ చేశారు.


తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో.. ఉచిత విద్యుత్ కోసం కరెంట్ శాఖ అధికారులందరినీ పిలిచి మీటింగ్ పెట్టానని చెప్పారు. రాష్ట్రమంతా నిరంతరాయంగా కరెంట్ ఇవ్వడం సాధ్యమా? కాదా? అని అడిగితే.. అధికారులు 5 రోజులు టైమ్ అడిగారని అన్నారు. వాళ్లు బాగా ఆలోచించుకుని వచ్చి.. మీరు తలుచుకుంటే సాధ్యమేనని చెప్పారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కాకపోతే వాళ్లు తన దగ్గర కొన్ని డిమాండ్లు పెట్టారని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలోని ట్రాన్స్‌ఫార్మర్లు అన్నిటినీ రేషనలైజ్ చేయాలని.. ఎమర్జెన్సీ సమయంలో అప్పటికప్పుడు బయటి నుంచి పవర్ కొనేందుకు.. ఎలాంటి అనుమతులు లేకుండా వెంటనే వాడుకునే అవకాశం ఉండేలా 25 కోట్ల నిధులు అందుబాటులో ఉంచాలని అన్నారని.. అందుకు తాను సరేనన్నానని చెప్పారు సీఎం.


ఇక, విద్యుత్ శాఖలో ఏదైనా ఫైల్ పుటప్ చేస్తే.. మంత్రితో మాట్లాడాలి, సీఎంతో మాట్లాడాలి అంటూ ఐఏఎస్ అధికారులు ఆలస్యం చేస్తుంటారని.. అదే టెక్నికల్ అధికారులు ఉంటే ఆ ప్రాబ్లమ్ లేకుండా వెంటనే పని అయిపోతుందనే విషయం తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. అందుకే, గడిచిన పదేళ్లలో విద్యుత్ శాఖలో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్‌ను కూడా నియమించలేదని చెప్పారు సీఎం కేసీఆర్.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×