నియోజకవర్గాల పునర్విభజన అంశం ఉత్తర, దక్షిణ భారతం మధ్చ చిచ్చరేపిందనే చెప్పాలి. ఈ బిల్లు వలన నార్త్ ఇండియా స్టేట్స్ సంతోషం వ్యక్తం చేస్తుండగా.. సౌత్ స్టేట్స్ మాత్రం భయాందోళనకు గురువుతున్నాయి. పార్లమెంటులో తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని అభద్రతా భావంతో ఉన్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలు జనాభా, విస్తీరణ పరంగా పెద్దవి. అక్కడ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు అధికంగా ఉన్నాయి. సౌత్ విషయానికొస్తే ఇక్కడ కుటుంబ నియంత్రణను చాలా స్ట్రిక్‌గా ప్రభుత్వాలు అమలు చేశాయి. ఫలితంగా ఇప్పుడు అదే దక్షిణాది కొంపముంచిందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ,ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు దక్షిణ భారతంగా పిలవబడుతున్నాయి.
ప్రస్తుత పార్లమెంటులో 545 స్థానాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 800లక పైగా ఎంపీ స్థానాలు పెరగనున్నాయి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కలుపుకుంటే కేవలం 130 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి.తమిళనాడు -39,కర్ణాటక-28, ఆంధ్రప్రదేశ్ -25, కేరళ -20, తెలంగాణ -17, పుదుచ్చెరి -1 ఉన్నాయి. కేంద్రం ప్రతిపాదించిన మేరకు 50 శాతం మేర అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెంచితే దక్షిణాది మొత్తం కలిపిన 200 సీట్లకు మించవు. అనగా.. పార్లమెంటులో 800లకు పైగా సీట్లు పెరిగితే అందులో దక్షిణాది రాష్ట్రాల వాటా కేవలం 200 అనుకుంటే మిగతా 600 సీట్లు ఉత్తరాది నుంచే ఉంటాయి. అనగా కేంద్రంలో ఏదైనా పార్టీ అధికారంలోకి రావాలంటే మెజార్టీ సీట్లు సుమారు 450 వరకు వస్తే సరిపోతుంది. అనగా 600 స్థానాలు ఉత్తరాది నుంచే ఉన్నందున కేంద్రంలో అధికారంలోకి రావాలనుకునే పార్టీ కేవలం అక్కడే ఫోకస్ పెడుతుంది.వారికి సౌత్‌తో పనిలేదు. సౌత్ సీట్లు లేకపోయినా కేంద్రంలో ప్రభుత్వం కొలువుదీరుతుంది. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం పోరాడినా కేంద్రంలోని పెద్దలు పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చు.
పైన చెప్పిన ప్రకారం దక్షిణాదిలోనూ ఉత్తరాదితో సమానంగా సీట్లు పెంచాలని సౌత్ స్టేడ్స్ డిమాండ్ చేస్తున్నాయి.. ఉత్తరాదిన 200 సీట్లు పెంచితే ఇక్కడ కూడా 200 పెంచాలని పట్టుబడుతున్నాయి.లేదంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. కేంద్రం మాత్రం తాము జనాభా లెక్కల మేరకు డీలిమిటేషన్ చేయడం లేదని.. అన్నిరాష్ట్రాల్లో 50 శాతం పెంచుతామని.. సౌత్ స్టేట్స్‌కు ఎటువంటి నష్టం వాటిల్లదని కేంద్రం చెబుతోంది.దీనిని ముందే పసిగట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. డీలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. హైబ్రిడ్ లేదా జీఎస్‌డీపీ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై ప్రధాని మోడీ, సౌత్ సీఎంలకు లేఖలు రాశారు. దక్షిణాదికి ద్రోహం చేస్తే ఊరుకునేది లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం కేంద్రానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ లేఖకు మాత్రం ఆయన రిప్లయ్ ఇవ్వలేదు.
పేరుకే పెద్ద కమెడియన్..చందాలు వసూలు చేసి కూతురి పెళ్లి చేశానంటూ ఎమోషనల్!
ఇదిలాఉండగా, ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర కీలకంగా మారింది. ఆయన ఎన్డీయే కూటమిలో సభ్యుడిగా ఉన్నారు.సౌత్ స్టేట్స్ నుంచిఆయన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రంలో కీలక హోదాలో ఉన్నారు. ఆయన ఒక్కసారి గట్టిగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని, డీలిమిటేషన్ ఇప్పుడు వద్దని భీష్మించుకు కూర్చుంటే కేంద్రం వెనక్కి తగ్గుతుంది. కానీ, చంద్రబాబు మాత్రం మోడీకి మద్దతు పలికారు. ప్రతిపక్షాలకు సైతం కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతివ్వాలని కోరారు. చంద్రబాబు మాత్రం డీలిమిటేషన్‌కు మద్దతిస్తుంటే.. శిష్యుడు రేవంత్ మాత్రం ఆ బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడం చర్చనీయాంశంగా మారింది.