E-Paper
Advertisement

మంత్రి లోకేష్‌పై వర్మ సంచలన కామెంట్స్.. ఎవరు ఉన్నారంటూ ఎదురుప్రశ్న, జనసేనలో చర్చ

మంత్రి లోకేష్‌పై వర్మ సంచలన కామెంట్స్.. ఎవరు ఉన్నారంటూ ఎదురుప్రశ్న, జనసేనలో చర్చ
Advertisement

Ap Politics: టీడీపీలో రాజకీయాలు పీక్స్‌కు చేరాయా? వర్మ కామెంట్స్‌పై కూటమిపై దుమారం రేగుతోందా? జనసేన అధినేతను టార్గెట్‌‌గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? ఇంతకీ వర్మ మాటల వెనుక అసలు మర్మమేంటి? ఇటు టీడీపీ.. అటు జనసేన నేతలు ఏమంటున్నారు? దీనిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది.

మంత్రి లోకేష్‌పై పిఠాపురం వర్మ సంచలన కామెంట్స్

Advertisement

టీడీపీ హైకమాండ్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. యువనేతలకు కీలక పదవులను అప్పగించింది. మంత్రి నారా లోకేష్‌కు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించింది. యువనేతకు కష్టానికి తగిన ఫలితం దక్కిందని ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలు అన్నారు. రేపటి రోజున పార్టీ ఆయన అధ్యక్షుడు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ మరి కొందరు నేతలు చెప్పుకొచ్చారు.

తాజాగా పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ మరో అడుగు ముందుకేశారు. ముఖ్యమంత్రి రేసులో నారా లోకేష్ ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వర్మ. గురువారం మీడియా ముందుకొచ్చిన ఆయన, ఏపీలో ఆయన కన్నా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి అర్హుడైన నాయకుడు ఎవరూ ఉన్నారంటూ ఎదురు ప్రశ్నించారు.

Advertisement

లోకేష్ కంటే రాష్ట్రంలోొ ఎవరు ఉన్నారంటూ ఎదురుప్రశ్న.. ఆపై జనసేనలో చర్చ

యువగళం పాదయాత్రతో టీడీపీకి పూర్వవైభవం తెచ్చారని, అంతేకాదు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్ అని ఆకాశానికి ఎత్తేశారు. వర్మ వ్యాఖ్యల వెనుక మరో వెర్షన్ కూడా బలంగా వినిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన తన కంచుకోటగా మార్చుకోవడం ఆయనకు మింగుడుపడడం లేదని అంటున్నవాళ్లు లేకపోలేదు. ఈ నేపథ్యంలో లోకేష్‌ను టచ్ చేస్తూ ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. జనసేన నేతలు వర్మ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. మొత్తానికి వర్మ చేసిన కామెంట్స్‌పై జనసేనలో చిన్నపాటి చర్చ అప్పుడే మొదలైంది.

ALSO READ: డీలిమిటేషన్‌పై కవిత వ్యాఖ్యలు.. రెండు బిల్లులు లింక్ వెనుక పెద్ద కుట్ర, మరోసారి ఉద్యమం తప్పదని హెచ్చరిక

 

Related News

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

Big Stories

Advertisement
×