E-Paper
Advertisement

CM Revanth Reddy: ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్.. కాసేపట్లో రాహుల్‌గాంధీతో భేటీ, పార్టీ ముఖ్యనేతలతో..

CM Revanth Reddy: ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్.. కాసేపట్లో రాహుల్‌గాంధీతో భేటీ, పార్టీ ముఖ్యనేతలతో..
Advertisement

CM Revanth Reddy: తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలపై పార్టీ పెద్దలతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. పార్టీ పటిష్టతకు కొన్ని సలహాలు, సూచనలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. తొలుత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ భేటీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హారయ్యారు.

ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్.. పార్టీ ముఖ్యనేతలతో భేటీ

Advertisement

బుధవారం ఉదయం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి. ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ, సీనియర్ నేత జీవన్‌రెడ్డి వ్యవహారంపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  యువనేతతో సమావేశం తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

తాజాగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేంనరేందర్ రెడ్డి.. ఖర్గే నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని అభినందించారు ఖర్గే. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. నాయకులందరూ కలిసి ప్రస్తుత రాజకీయాలు, తెలంగాణలో పార్టీ స్థితిగతులు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు.

Advertisement

రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. రాబోయే రాజకీయ సవాళ్లను ఏ విధంగా ఎదుర్కొవాలి అనేదానిపై పార్టీ చీఫ్ పలు సూచనలు చేశారు. ఆ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్, బలరాం నాయక్ పాల్గొన్నారు.

అంతకుముందు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించినట్టు ఢిల్లీ పొలిటికల్ వర్గాల సమాచారం. కేరళలో పార్టీ గెలుపుపై చర్చించినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం నాటికి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ హైదరాబాద్‌కు రానుంది.

ALSO READ: కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీలో కీలక పోస్ట్..?

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×