E-Paper
Advertisement

CM Revanth Reddy: తక్కువ వడ్డీ రుణాలతో తెలంగాణ అభివృద్ధికి వేగం.. హడ్కో ఛైర్మన్‌తో సీఎం కీలక భేటీ

CM Revanth Reddy: తక్కువ వడ్డీ రుణాలతో తెలంగాణ అభివృద్ధికి వేగం.. హడ్కో ఛైర్మన్‌తో సీఎం కీలక భేటీ

CM Revanth Reddy: రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ అభివృద్ధి ప్రాజెక్టులకు.. తక్కువ వడ్డీ రేటుతో దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, హడ్కో ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఈ భేటీ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా భావిస్తున్నారు.

సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఆర్‌ఆర్‌ఆర్‌, రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని, సీఎం హడ్కోను విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా పెరుగుతాయని సీఎం స్పష్టం చేశారు.

భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నై వరకు గ్రిన్‌ఫీల్డ్ రహదారులు, బందరు పోర్ట్ వరకు నిర్మించనున్న కొత్త గ్రిన్‌ఫీల్డ్ రహదారి, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదిస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులపై సీఎం, హడ్కో ఛైర్మన్‌ల మధ్య విస్తృత చర్చ జరిగింది. ఈ రహదారులు దేశీయ రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా ఉంటాయని సీఎం అభిప్రాయపడ్డారు.

గతంలో రాష్ట్రం అధిక వడ్డీ రేటుతో తీసుకున్న కొన్ని రుణాలు ప్రభుత్వంపై.. భారంగా మారిన విషయాన్ని ముఖ్యమంత్రి హడ్కో ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ రుణాల పునర్వ్యవస్థీకరణ చేయాల్సిన అవసరం ఉందని సూచించగా, ఈ అంశంపై ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత తక్కువ వడ్డీతో రుణాల పునర్వ్యవస్థీకరణకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ప్రస్తుతం తెలంగాణ సానుకూల వృద్ధి రేటుతో ముందుకెళ్తున్న రాష్ట్రాలలో ఒకటిగా నిలుస్తోందని సీఎం వివరించారు. ఈ అనుకూల పరిస్థితుల్లో తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు లభిస్తే ప్రజలకు ప్రత్యక్ష లాభం చేకూరుతుందని, అభివృద్ధి పనులు మరింత వేగం అందుకుంటాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా పట్టణ మౌలిక వసతులు, రహదారి నెట్‌వర్క్, ప్రజా రవాణా వంటి రంగాల్లో పెట్టుబడులు పెరిగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇప్పటికే హడ్కో ద్వారా.. రుణాలు మంజూరు చేసినట్లు ఛైర్మన్ సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేశారు. అదేవిధంగా మరో రూ. 10 లక్షల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన రుణాల కోసం.. ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కూడా సానుకూలంగా స్పందించారు.

ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న భారత్ గ్లోబల్ సమ్మిట్‌కు.. హడ్కో ఛైర్మన్ తప్పకుండా హాజరుకావాలని సీఎం ఆహ్వానించారు. ఈ సమ్మిట్ ద్వారా దేశ, విదేశాల పెట్టుబడిదారులకు తెలంగాణ అభివృద్ధి దిశను వివరించే అవకాశం లభిస్తుందని రేవంత్  పేర్కొన్నారు.

Also Read: హైదరాబాద్‌కు మీనాక్షి నటరాజన్.. వారంపాటు మకాం, డీసీసీల ఇష్యూపై ఫోకస్

ఈ కీలక సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్, హడ్కో రీజినల్ చీఫ్ పి. సుభాష్ రెడ్డి, హడ్కో జాయింట్ జనరల్ మేనేజర్లు ఆశీష్ గుండాల, సయ్యద్ రహీముద్దీన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×