E-Paper
Advertisement

APSRTC Bus: కర్చీఫ్ వేసిన సీట్లో కూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు

APSRTC Bus: కర్చీఫ్ వేసిన సీట్లో కూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు
Advertisement

APSRTC Bus: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు తర్వాత, ఆర్టీసీ బస్సుల్లో సీటు గొడవలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణికుడిపై మహిళలు దాడి చేశారు. ప్రయాణికుడిని జుట్టు పట్టుకుని మరి కొట్టారు. తాము కర్చీఫ్ వేసిన సీటులో ఎలా కూర్చుంటావా అంటూ తోటి ప్రయాణికుడితో మహిళలు ఘర్షణకు దిగారు. కాకినాడ జిల్లా తుని నుంచి నర్సీపట్నం వెళ్తున్న బస్సులో ఘటన చోటుచేసుకుంది.

బస్సు రద్దీగా ఉండటంతో ఇద్దరు మహిళలు తమ కర్చీఫ్‌లు ఒక సీటుపై వేసుకున్నారు. ఇది బస్సుల్లో సాధారణంగా చూసే అసాధారణ ‘సీటు బుకింగ్’ పద్ధతి. అయితే కొంతసేపటి తర్వాత, ఓ వ్యక్తి ఆ సీటులో కూర్చున్నాడు. దీంతో మహిళలు కోపంతో అతనితో వాగ్వాదానికి దిగారు. “మేము కర్చీఫ్ వేసిన సీటులో ఎలా కూర్చుంటావు?” అని ప్రశ్నించారు. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది.

Advertisement

వాగ్వాదం మరింత పెరిగిన తర్వాత, మహిళల్లో ఒకరు ప్రయాణికుడి జుట్టు పట్టుకుని గట్టిగా కొట్టడం మొదలెట్టారు. మరో మహిళ కూడా చేరి, అతనిపై దాడి చేసింది. ఈ ఘటనను ఓ ప్రయాణికుడు మొబైల్‌తో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం X లో వైరల్ అవుతుంది.

Also Read: వైజాగ్‌కు కొత్త కిరీటం: 300 రూపాయల టికెట్‌తో ఆకాశంలో నడిచే అనుభూతిని అందించనున్న స్కై వాక్ బ్రిడ్జ్

Advertisement

అయితే ఈ వీడియో పై రియాక్ట్ అయ్యి చాలా మంది ప్రజలు ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల సీటు గొడవలు ఎక్కువ అవుతున్నాయి. అంతేకాకుండా బస్సులో పురుషులకు, మహిళలకు సమాన హక్కు ఉండాలి. మొత్తం వారే సీట్లు ఆక్రమిస్తున్నారు. మేము డబ్బులు కట్టి కూడా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని పురుషులు విమర్శిస్తున్నారు. దీనిపై అందరికి సమ న్యాయం కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Related News

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Big Stories

Advertisement
×