E-Paper
Advertisement

CM Revanth Reddy : మూసీ నదికి పునర్ వైభవం.. పక్కా ప్లాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లండన్‌ పర్యటన కొనసాగుతోంది. మూసీ నదీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు గాను థేమ్స్ నది నిర్వహణ అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించారు. మూసీ పరీవాహక అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం రేవంత్ తెలిపారు. సమావేశంలో థేమ్స్‌ నది చరిత్ర, నది అభివృద్ధికి ఎదురైన సవాళ్లు,పెట్టుబడి, ఇంజినీరింగ్‌, ఆదాయం తదితర అంశాలను పోర్ట్‌ ఆఫ్ లండన్‌ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు.

CM Revanth Reddy : మూసీ నదికి పునర్ వైభవం.. పక్కా ప్లాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి..
Advertisement
CM Revanth Reddy news

CM Revanth Reddy news(Political news today telangana):

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లండన్‌ పర్యటన కొనసాగుతోంది. మూసీ నదీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు గాను థేమ్స్ నది నిర్వహణ అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించారు. మూసీ పరీవాహక అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం రేవంత్ తెలిపారు. సమావేశంలో థేమ్స్‌ నది చరిత్ర, నది అభివృద్ధికి ఎదురైన సవాళ్లు,పెట్టుబడి, ఇంజినీరింగ్‌, ఆదాయం తదితర అంశాలను పోర్ట్‌ ఆఫ్ లండన్‌ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు.

Advertisement

హైదరాబాద్‌లో మూసీ,ఉస్మాన్‌ సాగర్‌, హుస్సేన్‌ సాగర్‌, వంటి చెరువుల ప్రాధాన్యత నిపుణులకు వివరించారు.హైదరాబాద్‌లో ఉన్న చెరువుల ప్రస్తుత పరిస్థితులపై థేమ్స్‌ నిపుణులకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. మూసీకి పునర్‌వైభవం తీసుకువస్తే నది, చెరువులతో హైదరాబాద్‌ మరింత పర్యాటక ప్రాంతంగా మారుతుందని సీఎం తెలిపారు. ముందు ముందు హైదరాబాద్ మరింత శక్తివంతమవుతుందని పేర్కొన్నారు. మూసీ విజన్‌ 2050కి స్పందించిన పోర్ట్‌ ఆఫ్‌ లండన్‌ బృందం పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం తో మరిన్ని చర్చలు, భాగస్వామ్యానికి సిద్ధమని పోర్ట్‌ ఆఫ్‌ లండన్‌ అధికారులు ప్రకటించారు.

Related News

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Big Stories

Advertisement
×