BigTV English

Pakistan Cricket Board : వరల్డ్ కప్ దెబ్బ గట్టిగానే తగిలిందా..? పాకిస్తాన్ పరిస్థితేమిటి..? 

Pakistan Cricket Board : వరల్డ్ కప్ దెబ్బ గట్టిగానే తగిలిందా..? పాకిస్తాన్ పరిస్థితేమిటి..? 

Pakistan Cricket Board : వన్డే వరల్డ్ కప్ 2023 పాయింట్ల పట్టికలో చివరికి పాకిస్తాన్ 5వ స్థానంలో నిలిచింది. నిజానికి అందులో టాప్ 4 లో నిలిచిన జట్లు సెమీస్ కి చేరాయి. ఒకరకంగా చెప్పాలంటే కేవలం ఒక స్థానం ముందు పాకిస్తాన్ ప్రయాణం ఆగిపోయింది. బాబర్ ఆజామ్ కెప్టెన్సీలో ఆ మాత్రమైనా పాకిస్తాన్ ముందడుగు వేసింది. పాక్ తర్వాత 6వ స్థానంలో ఆఫ్గనిస్తాన్ ఉంటే, 7వ స్థానంలో ఇంగ్లాండ్ నిలిచింది. తర్వాత బంగ్లాదేశ్, ఆ తర్వాత శ్రీలంక, ఆఖరున నెదర్లాండ్స్ ఉన్నాయి.


ఒకరకంగా చెప్పాలంటే పాకిస్తాన్ తో సమానమైన ఇంగ్లాండ్ జట్టే 7వ స్థానంలో నిలిచింది. దాంతో పోల్చుకుంటే పాక్ ఒకరకంగా నయమే అనుకోవాలి. కానీ వరల్డ్ కప్ లో టీమ్ ఇండియాపై ఓడిపోవడంతో పాటు, ఆడిన తొమ్మది మ్యాచ్ ల్లో నాలుగింట గెలిచి, ఐదింట ఓటమి పాలైంది. దీంతో గ్రూప్ దశలోనే వెనుతిరిగింది.

వరల్డ్ కప్ ఎంతటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అలా ఉత్పన్నమైన వేడిలో బాబర్ ఆజామ్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగుతున్నాడు. ప్రజల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడికి తలఒగ్గిన పాకిస్తాన్ బోర్డు కూడా టెస్ట్ మ్యాచ్ లకు షాన్ మసూద్ ను కెప్టెన్ గా ఎంపిక చేసింది. వైట్ బాల్ క్రికెట్ లో షాహిన్ ఆఫ్రిదికి పగ్గాలు అందించింది. అయినా సరే మార్పు లేదు సరికదా…బాబర్ కెప్టెన్సీ కన్నా ఘోరంగా వీరి ఆధ్వర్యంలో ఉంది.


ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ లు కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో పాక్ జట్టు ఓడిపోయింది. ఇప్పుడు న్యూజిలాండ్ లో జరుగుతున్న ఐదు టీ 20ల సిరీస్ లో కూడా పాకిస్తాన్ దారుణంగా ఆడుతోంది. ఐదింటిలో నాలుగు మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. ఇక మిగిలిన మ్యాచ్ ఆదివారం జరగనుంది.

దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తలపట్టుకుంది. వరల్డ్ కప్ తర్వాత కోచింగ్ స్టాఫ్ చాలామందిని మార్చేసింది. అయితే పాక్ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ  క్రికెట్ డైరక్టర్ గా ఎంపికైన మికీ ఆర్థర్, ప్రధానకోచ్ గ్రాంట్ బ్రాడ్ బర్న్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుట్టిక్ రాజీనామా చేశారు.

వీరందరి రాజీనామా, ఇంకా మార్పులతో తాత్కాలికంగా డైరక్టర్ ఆఫ్ క్రికెట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ ఆటగాడు మహ్మద్ హఫీజ్ ను కూడా ప్రస్తుతం తప్పిస్తారనే వార్తలు వస్తున్నాయి. అతని కాంట్రాక్ట్ ను పొడిగించ వద్దని పాక్ క్రికెట్ బోర్డుని ఆ దేశ క్రీడా శాఖ కోరినట్టు తెలుస్తోంది.

ఏదేమైనా ఆస్ట్రేలియా, ఇటు న్యూజిలాండ్ లో కూడా పాక్ జట్టు ఓటమి బాటలో నుంచి బయటకు రావడం లేదు. వరల్డ్ కప్ తర్వాత ఇప్పటి వరకు జరిగిన అన్ని ఫార్మాట్లు కలిపి వరుసగా 8 మ్యాచ్ ల్లో వారు ఓటమి పాలయ్యారు. జట్టంతా మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, ఎప్పుడేం జరుగుతుందోననే భయంతో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అందుకని మనసు పెట్టి ఆడలేకపోతున్నారని అంటున్నారు.

Pakistan Cricket Board, Coach Mickey Arthur,

Tags

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×