E-Paper
Advertisement

Hyderabad News: చౌమహల్లా ప్యాలెస్‌లో సంగీత కార్యక్రమం, హాజరైన గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad News: చౌమహల్లా ప్యాలెస్‌లో సంగీత కార్యక్రమం, హాజరైన గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

Hyderabad News: నిజాం వైభవానికి ప్రతీకగా చెబుతారు చౌమహల్లా ప్యాలెస్. రాత్రి సంగీత కార్యక్రమానికి వేదికగా మారింది. ప్రముఖ సూఫీ గజల్ గాయని అనితా సింఘ్వీ తన ప్రదర్శనతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.

చౌమహల్లా ప్యాలెస్‌లో సంగీత కార్యక్రమం

Advertisement

హైదరాబాద్‌లోని శనివారం రాత్రి చౌమహల్లా ప్యాలెస్‌లో సంగీత మ్యూజిక్ ఈవెంట్ జరిగింది. గ్వాలియర్‌కు చెందిన ప్రముఖ గాయని అనితా సింఘ్వీ తన గాత్రంతో మంత్రముగ్ధులను చేశారు. భక్తి-కవిత్వాన్ని మిళితం చేస్తూ చేసిన ప్రదర్శన అక్కడివారిని ఆకట్టుకుంది. ఆమె పాడిచన అల్లా హూ.. అల్లా హూ నామస్మరణతో ప్రతిధ్వనించింది.

ఈ పాటతో అక్కడి వాతావరణం ఆధ్యాత్మిక పారవశ్యాన్ని నింపింది. అంతేకాదు ప్రధాన ఆకర్షణగా ప్రసిద్ధ అల్బమ్ ‘సదా-ఎ-సూఫీ’ లోని పురాతన సూఫీ ఖవ్వాలీ దమా దమ్ మస్త్ ఖలందర్‌ని ఆలపించారు. లాల్ షాబాజ్ ఖలందర్ భక్తిని చాటిచెప్పే ఈ పాట సంగీత ప్రియుల్లో ఆనందాన్ని నింపింది.

Advertisement

హాజరైన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించారు గాయని అనితా సింఘ్వీ. పండిట్ క్షీర సాగర్ వద్ద శిక్షణ పొందారు. ఖయ్యామ్ వంటి దిగ్గజాలతో కలిసి పని చేసిన అనుభవం ఆమె సొంతం. అనితా సింఘ్వీ ప్రదర్శన తమకు మానసిక ప్రశాంతతను అందించిందని అక్కడికి వచ్చిన అతిధులు కొనియాడారు. ఆమె గానం నుంచి జారువారిన ప్రతీ పాట అద్భుతమని పేర్కొన్నారు.

గాలిబ్, అల్లామా ఇక్బాల్ వంటి రచనలకు తనదైన శైలిలో ప్రాణం పోశారు గాయని అనితా సింఘ్వీ. హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పడమే కాకుండా సూఫీ సంగీతం ద్వారా అనేకమంది హృదయాలను కలిపే వారధిగా నిలిచింది కార్యక్రమం. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహించిన కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల-పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అభిషేక్ మను సింఘ్వీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ALSO READ:  పోలీసింగ్ అంటే ఫోర్సు కాదు..  అదొక సర్వీసు

 

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×