BigTV English

Cm Revanth Reddy : బాధితులకు న్యాయం జరిగితేనే పోలీసులపై నమ్మకం నిలబడుతుంది : పోలీస్ డ్యూటీ మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy : బాధితులకు న్యాయం జరిగితేనే పోలీసులపై నమ్మకం నిలబడుతుంది : పోలీస్ డ్యూటీ మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy : తెలంగాణ  పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌లోని రాజ్‌బహదూర్‌ వెంకటరామిరెడ్డి పోలీస్‌ అకాడమీలో సీఐడీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పోలీస్ డ్యూటీ మీట్‌-2024 ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు. తొలుత నిర్వహించిన పోలీస్ పరేడ్‌ లో భాగంగా  సీఎం రేవంత్‌రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పోలీసులు హాజరయ్యారు.


ఆలిండియా మీట్ ఎక్కడంటే…

అనంతరం విజేతలకు ట్రోఫీలను బహురించారు. అంతకుముందు సైబర్ క్రైమ్ కి సంబంధించిన హ్యాండ్‌బుక్‌ని సీఎం చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. వచ్చే జనవరిలో రాంచీలో నిర్వహించనున్న ఆలిండియా పోలీస్‌ మీట్‌లో విజేతలు పాల్గొనున్నారు. వివిధ శాఖలకు చెందిన పోలీసు బృందాలు పాల్గొన్నాయి.


పదేళ్లలో తొలిసారిగా…

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన పదేళ్లకు మొదటిసారిగా ఈ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం గమనార్హం. ఫలితంగా పోలీస్‌ అధికారులు నాలుగు రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ మీట్ లో భాగంగా 26 పోలీస్‌ విభాగాల నుంచి 13 బృందాలు పలు ఈవెంట్లను నిర్వహించాయి. సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌, డాగ్‌ స్క్వాడ్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌, ఫొటో, వీడియోగ్రఫీ లాంటి పోటీలను పోలీస్ డ్యూటీలో భాగంగా నిర్వహించారు.

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్…

పోలీస్ పిల్లల కోసం త్వరలోనే ప్రత్యేకమైన స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. దీనికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పేరును పరిశీలిస్తున్నట్లు చెప్పారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్ణీత ప్రమాణాలతో మొదలవుతుందన్న సీఎం,  తొలి విడతగా 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రారంభిస్తామన్నారు.

ఇక పోలీసుల సేవలను సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. పోలీస్ అంటే ఉద్యోగం కాదని అదో భావోద్వేగం అని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పోలీసులకు సైతం ప్రత్యేక స్థానం ఉందని ఆయన గుర్తుచేశారు. ఇందుకు కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగమే గొప్ప ఉదాహారణ అన్నారు.

ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు, 2013 నుంచి 2024 కాలంలో పోలీస్ డ్యూటీ మీట్ జరగలేదన్నారు సీఎం. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరుగుతున్న మొట్టమొదటి డ్యూటీ మీట్ ఇదేనన్నారు.

పోలీసన్న కృషి భేష్…

రాష్ట్ర ప్రతిష్ట పెరగాలంటే, పోలీస్ శాఖ గౌరవం పెరగాలన్నారు.  శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కుటుంబాలకు దూరంగా ఉంటూ కష్టపడుతున్నారని,  ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే అందుకు కారణం పోలీసుల కృషే అన్నారు.

టెక్నాలజీ బాగా వాడదాం…
శాంతి భద్రతలు ఉంటేనే…

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×