E-Paper
Advertisement

India AI Impact Summit: ఏఐ శకం మొదలు.. హైదరాబాద్ అనువైన ప్రదేశం, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో సీఎం రేవంత్

India AI Impact Summit: ఏఐ శకం మొదలు.. హైదరాబాద్ అనువైన ప్రదేశం, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో సీఎం రేవంత్
Advertisement

India AI Impact Summit: ప్రపంచవ్యాప్తంగా ఏఐ శకం ఇప్పటికే మొదలైందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. గతంలో పారిశ్రామిక విప్లవం వచ్చిందని, ఇప్పుడు సాప్ట్‌వేర్ విప్లవం నడుస్తోందన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.

ఏఐ శకం మొదలైందన్న సీఎం రేవంత్ రెడ్డి

Advertisement

మనిషికి ఎన్నో పరిమితులు ఉండవచ్చన్నారు సీఎం. ఇప్పుడు మనిషి అత్యున్నత ఆవిష్కరణ అయిన ఏఐ ఫలితాలు మనం చూస్తున్నామని అన్నారు. మనిషి కంటే ఏఐ ఎక్కువ తెలివితేటలు కలిగి ఉందన్నారు. ఆలోచనలే మన జీవితాలను మార్చివేస్తాయన్నారు. వ్యాక్సిన్లు, విమానాల వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయన్నారు.

ప్రపంచంలోని టెక్ కంపెనీల దిగ్గజాలు ఈ సదస్సుకు వచ్చాయన్నారు. భారతీయులు ఎక్కువగా సోషల్ మీడియా వాడుతారని, ఐఏ రంగంలతో భారత్ గ్లోబ్ లీడర్ గా ఎదగాలన్నారు. ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలని మనసులోని మాటను బయటపెట్టారు. ఏఐ వార్ రూమ్ కోసం హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశమన్నారు. ఇప్పటికే ఏఐ యూనివర్సిటీని సకల వసతులతో ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఏఐ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని ఇండియా అంది పుచ్చుకోవాలన్నారు ముఖ్యమంత్రి. అంతేకాదు ఏఐలో స్టార్టప్‌లను భారత్ ప్రొత్సహించాలన్నారు. ప్రతీ ఆరునెలలకు ఒకసారి హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఏఐ సదస్సులు జరగాలన్నారు. జీఎస్టీ కౌన్సిల్ తరహాలో ఏఐ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రధానిని కోరారు.

అదే సమయంలో ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ వచ్చి ఏఐ రంగంలో పెట్టుబడి పెట్టాలని టెక్నాలజీ దిగ్గజాలను ఈ సందర్భంగా కోరారు. సమావేశం తర్వాత టెక్ పారిశ్రామిక‌వేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

ALSO READ: సిద్దిపేట యువతకు గేమ్ చేంజర్.. హరీష్ అన్న ఉద్యోగ యాప్ ను ప్రారంభించిన హరీష్ రావు!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×