Nawab Cafe Movie: నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా ‘నవాబ్ కేఫ్’ అనే సినిమా రూపొందింది. మొదట దీనికి ‘చాయ్ వాలా’ అనే టైటిల్ పెట్టారు. తర్వాత ఎందుకో ‘నవాబ్ కేఫ్’ గా మార్చారు. దాని వల్ల ఈ సినిమా ఒకటి ఉంది అని జనాలకి తెలిసింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో? నొప్పించిందో? తెలుసుకుందాం రండి .
Read also-Bramhanandam: కామెడీ కింగ్ బ్రహ్మానందంతో మాజీ సీఎం వైయస్ జగన్… వైరల్ అవుతున్న ఫోటో
రంగనాథం(రాజీవ్ కనకాల) విలువలకి మారురూపం. అతని తండ్రి ఓ నవాబ్ దగ్గర టీ పెట్టి ఇచ్చేవాడు. ఆ టీ వల్ల నవాబ్ చాలా టెన్షన్స్ నుండి విముక్తి పొందేవాడు. ఆ కృతజ్ఞతతో ఇండియా నుండి వెళ్లిపోవాల్సి వచ్చినప్పుడు ఆ నవాబ్.. రంగనాథం తండ్రికి కొన్ని స్థలాలు ఇస్తాడు. తర్వాత భూమి రేటు పెరిగినప్పుడు.. వాటి వాల్యూ కూడా కోట్లల్లో పెరుగుతుంది. రంగనాథం తండ్రికి మరో కొడుకు కూడా ఉంటాడు. అతనే పెద్దవాడు. ఆస్తుల పంపకాల టైం వచ్చేసరికి రంగనాథం తనకి కేఫ్ ఒకటి చాలు అని చెప్పి.. మిగతా వాటిని తన అన్నకి ఇచ్చేస్తాడు. దీంతో రంగనాథ్ ఓ సాధారణ మధ్య తరగతి మనిషిగా మిగిలిపోతాడు. అయితే రంగనాథ్ కొడుకు రాజాకి(శివ కందుకూరి) డబ్బు, లగ్జరీ లైఫ్ అంటే మోజు. ఎలాగైనా విదేశాలకి వెళ్లి కోట్లు సంపాదించాలని తాపత్రయ పడతాడు. అయితే ఇంతలో రంగనాథ్ అన్న కొడుకు కుమార్(చైతన్య) కన్ను నవాబ్ కేఫ్ పై పడుతుంది. అక్కడ షాపింగ్ కడితే కోట్లు సంపాదించొచ్చు అనేది అతని కోరిక. దీంతో రాజాని మంచి చేసుకుని కేఫ్ కొట్టేయాలని చూస్తాడు. ఆ కేఫ్ అమ్మేస్తే రూ.50 కోట్లు వస్తాయని అతన్ని రెచ్చగొడతాడు. దీంతో రాజా వెళ్లి అతని తండ్రి రంగనాథంతో గొడవపడతాడు? ఆ తర్వాత ఏం జరిగింది? మధ్యలో సఖి(తేజు అశ్విని) రాజా ప్రేమ కథ ఏమైంది? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
దర్శకుడు ప్రమోద్ హర్ష తీసుకున్న కథ ఏమాత్రం కొత్తది కాదు. గతంలో ఇలాంటి కథతోనే కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ సినిమా వచ్చింది. అంతెందుకు గతేడాది వచ్చిన ధనుష్ ‘ఇడ్లీ కడై’ అయితే ఈ ‘నవాబ్ కేఫ్’ కి చాలా సిమిలర్ గా ఉంటుంది. ఆ సినిమాలో ధనుష్ తండ్రి చనిపోయాక అతనిలా ఇడ్లీ, చట్నీ, సాంబార్ చేయలేక కష్టపడతాడు. అందువల్ల హోటల్ కి జనాలు రారు. ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ అంతే. తండ్రి చనిపోయాక హీరో అతనిలా టీ పెట్టడానికి కష్టపడతాడు. కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా రెండింటిలోనూ సేమ్. బహుశా ఈ రెండు సినిమాల దర్శకులు ఒకే హాలీవుడ్ సినిమా కాపీ కొట్టారేమో అనుకోవాలి. స్క్రీన్ ప్లే పరంగా అయితే నవాబ్ కేఫ్ లో కామెడీ పండలేదు. లవ్ స్టోరీ కన్విన్సింగ్ గా ఉండదు. టెక్నికల్ గా కూడా చాలా వీక్. సీన్ సీన్ కి జంప్ అవుతున్నట్టు ఈజీగా తెలిసిపోతుంది అంటే ఎడిటింగ్ ఎంత వీకో అర్ధం చేసుకోవచ్చు. డబ్బింగ్ లోపాలు కూడా కనిపిస్తాయి. మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకునే విధంగా లేదు.
Read also-Prabhas: ప్రభాస్ ఆల్ టైం ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా.. ఆ సినిమా అంటే అంత ఇష్టమా?
నటీనటుల విషయానికి వస్తే.. శివ కందుకూరి యాక్టింగ్ లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. ఎమోషనల్ సీన్స్ లో అయితే బాగా తేలిపోయాడు. కనీసం కామెడీ, యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఎనర్జీ చూపించలేకపోయాడు.తేజు అశ్విని.. సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది అంతే..! రాజీవ్ కనకాల ఎప్పటిలానే చనిపోయే పాత్రే చేసినా.. కథలో కీలకంగా ఉంటుంది. ఎమోషనల్ కూడా కనెక్ట్ అవుతుంది. మణిచందన తల్లి పాత్రకి న్యాయం చేసింది. చైతన్య, రాజ్ కుమార్ కసిరెడ్డి ఈ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారనుకుంటా. ఆ లోటు తీర్చడానికి దర్శకుడు చాలా కష్టపడ్డాడు.
ప్లస్ పాయింట్స్
మైనస్ పాయింట్స్
మొత్తంగా.. ‘నవాబ్ కేఫ్’ కథ పరంగా కొత్తగా అనిపించదు. టేకింగ్ పరంగా కూడా నిరాశపరుస్తుంది. ఎంతో ఓపిక ఉంటే తప్ప చివరి వరకు కూర్చోవడం కష్టమే.
రేటింగ్ : 1/5