E-Paper
Advertisement

CM revanth : రెచ్చగొట్టొందంటున్న సీఎం రేవంత్!

CM revanth : రెచ్చగొట్టొందంటున్న సీఎం రేవంత్!
Advertisement

సీఎం రేవంత్ రెడ్డి అటు కేంద్రంత వ్యవహరిస్తున్న తీరుపై, మరోవైపు రాష్ట్రంలో అధికార పార్టీలో జరుగుతున్న కొన్నిపరిణామాల పట్ల ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.ప్రభుత్వ బాధ్యత అంతా తన మీద వేసుకుని మోస్తున్న రేవంత్.. పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆయనను చికాకు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముందుగా కేంద్రం విషయానికొస్తే ఆయన నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా కేంద్రం సవరణలు చేసిన ‘మహిళా బిల్లు, డీలిమిటేషన్’ మీద చర్చ జరిగింది. ఇందులో రేవంత్ కొన్ని ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి చేసినట్టు సమాచారం. ఎన్నికల్లో లబ్ధికోసమే కేంద్రంలోని మోడీ సర్కారు వీటిని ఇప్పుడు తెరమీదకు తెచ్చిందని ఇండియా కూటమి ఆరోపిస్తున్నది.

మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు..

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ ముగిశాక సీఎం రేవంత్ ఢిల్లీలో చిట్ చాట్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదని ప్రకటించారు. ఈ బిల్లు తేవడం వలన చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 33 శాతం పెరగనుంది.అయితే,2029లోనే జనగణన తర్వాత దీనిని అమలు చేయాల్సి ఉన్నది. అయితే, ఎన్నికల్లో లబ్ధికోసమే ఆగమేఘాల మీద కేంద్రం మహిళా కోటా బిల్లును పార్లమెంటు ముందుకు తెస్తున్నదని సీఎం పేర్కొన్నారు.ఈనెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అందులో ‘మహిళా బిల్లు, డీలిమిటేషన్’ బిల్లులను ఆమోదించే అవకాశం ఉన్నది. దీంతో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు తప్పక కేటాయించాల్సి ఉంటుంది.కాగా, ఆగమేఘాల మీద ఎందుకు తెస్తున్నారని సీఎం రేవంత్ ప్రశ్నిస్తున్నారు.

దక్షిణాదికి అన్యాయం జరిగితే..

Advertisement

డీ లిమిటేషన్‌లో భాగంగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచుతామని ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించారు. ఇదే విషయాన్ని నిన్న సీఎం రేవంత్ ఉటంకించారు.అనగా.. ఏపీలో 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వాటిని 50 శాతానికి పెంచితే మొత్తం 50 అవుతాయి. అదే యూపీలో 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అందులో 50 శాతం అంటే మొత్తం 120 స్థానాలు పెరుగుతాయి. ఇలా పోల్చుకుంటే ఉత్తరాధి రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు అధికంగా పెరుగుతాయి. ఫలితంగా దక్షిణాదికి సీట్లు తగ్గుతాయని సీఎం రేవంత్ ముందు నుంచి చెబుతున్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా సమానంగా సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దక్షిణాదికి అన్యాయం జరిగితే ప్రజాఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది.. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు మంత్రి సీతక్క మాస్ వార్నింగ్

Advertisement

దీనికి తోడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైనా సీఎం అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రుల మీద వరుసగా అవినీతి ఆరోపణలు రావడాన్ని సీఎం సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు సొంత పార్టీ నేతలు బయటకు వెళ్లడం, ప్రభుత్వం మీద, పార్టీ మీద ఆరోపణలు చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని.. రాష్ట్ర అధిష్టానం మీద సైతం గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.అసంతృప్తులను బుజ్జగించాల్సిన పని రాష్ట్ర అధిష్టానం చేతుల్లో ఉన్నా వారి నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం ప్రతిపక్షాలు తీవ్ర ఆరపణలు చేస్తున్నాయని.. మంత్రులు సైతం ప్రతిపక్షాలు సరైన కౌంటర్లు ఇవ్వలేకపోవడంపైనా సీఎం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×