E-Paper
Advertisement

ప్రమోషనా పనిష్మెంటా.. సెక్రటేరియట్‌లో ఆమె బదిలీ వెనక ఆంతర్యమేమిటో..?

ప్రమోషనా పనిష్మెంటా.. సెక్రటేరియట్‌లో ఆమె బదిలీ వెనక ఆంతర్యమేమిటో..?
Advertisement

Secretariat News: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక శాఖలో స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన ఓ మహిళా ఆఫీసర్ బదిలీ పై ఇప్పుడు సెక్రటేరియట్ లో కీలక చర్చ మొదలైంది. స్పెషల్ సెక్రటరీ గా పనిచేసిన సదరు అధికారిణిని సడన్ గా బదిలీ చేయడంపై ఓ ఆంతర్యమున్నదనే చర్చ మొదలైంది. పైగా ఉత్తర తెలంగాణలోని ఓ ఏజెన్సీ ప్రాంతంలోని జిల్లాకు ఆమెను కలెక్టర్ గా నియమించారు. ఇది సాధారణ బదిలీ లాగా పైకి కనిపిస్తున్నప్పటికీ, పొలిటికల్ అజెండా ఉన్నట్లు సాక్షాత్తు ఉన్నతాధికారుల్లోనే చర్చ మొదలైంది. పరిపాలనలో భాగంగా ఫైనాన్స్ శాఖకు సంబంధించిన ఆఫీసర్లతో మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర కీలక పదవుల్లో ఉన్న నేతలు కలుస్తుంటారు. ఇది రోటీన్ గా జరిగే ప్రాసెస్.

జోరుగా ప్రచారం..

అయితే సదరు అధికారిణిని ఓ మాజీ మంత్రిని కలిసిన వెంటనే బదిలీ జరిగినట్లు ఇప్పుడు సెక్రటేరియట్‌లో ప్రచారం ఊపందుకున్నది. పైగా గతంలో ఫైనాన్స్ శాఖ కు బాస్ గా పనిచేసిన మాజీ మంత్రిని కలవడంతో సదరు అధికారిణి పట్ల ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించిందనే చర్చ కూడా ఉన్నది.సచివాలయంలోని కీలక విభాగం నుంచి మారుమూల జిల్లాకు పంపించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని సమాచారం. ఈ హఠాత్తు పరిణామంతో సదరు అధికారిణి షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది.ఈ విషయం చాలా ఆలస్యంగా సెక్రటేరియట్ వర్గాల్లో చర్చంశనీయం కావడం గమనార్హం.

Advertisement

Also Read: సోషల్ మీడియాపై ఏపీ కొత్త చట్టం.. ఇక వాళ్లకి నో ఎంట్రీ

నిఘా నీడలో ఐఏఎస్ యాక్టివిటీస్..?

గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేందుకు ప్రతిపక్షాలు వరుసుగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ ఫాలసీలు, నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలతో పాటు కీలక పైళ్లకు సంబంధించిన అంశాలూ ఉంటున్నాయి. అంతేగాక ప్రభుత్వం కొత్తగా తలపెట్టాల్సిన ప్రాజెక్టులు, కీలక కార్యక్రమాలు వంటి వన్నీ కూడా ముందే ప్రతిపక్షాలకు చేరుతున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా డైలమాలో పడాల్సి వస్తోన్నది. విత్ ఇన్ ది చాంబర్లలో తీసుకున్న నిర్ణయాలకు బయటకు పొక్కడంపై సర్కార్ ఆగ్రహంతో ఉన్నది. ఇదే క్రమంలో కొందరు ఆఫీసర్లపై కూడా ప్రభుత్వం నిఘా పెట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటీవల సదరు మహిళా అధికారి బదిలీ జరగడం మిగతా ఆఫీసర్లలోనూ హాట్ టాఫిక్ గా మారింది.

లీకు వీరులెవరు..?

Advertisement

సీఎంవో నుంచి మంత్రుల ఛాంబర్ల వరకు, ఆఫీసర్ల నుంచి అటెండర్ల వరకు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను లీకులు ఎవరు ఇస్తున్నారు? అనే అంశాలపై ఫోకస్ పెరిగింది. ప్రధానంగా ప్రతిపక్షాలతో సన్నిహితంగా ఉంటున్న అధికారులు, స్టాఫ్​ ఎవరు? అంటూ ప్రభుత్వం ఆరా తీస్తున్నది. తన సిక్రెట్ టీమ్‌తో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నది. కొన్ని అంశాలు మంత్రులకు దృష్టికి చేరకముందే ప్రతిపక్ష నేతలకు ముందే వెళ్తున్నట్లు ప్రభుత్వం కూడా గుర్తించింది. ఇందులో ప్రధానంగా కొందరు ఆఫీసర్లు తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు సర్కార్ భావిస్తున్నది. అలాంటి ఆఫీసర్ల జాబితాను కూడా ఇప్పటికే సీఎంవో వర్గాలు తెప్పించుకున్నాయి. మరింత లోతైన అధ్యయనం తర్వాత చర్యలు తీసుకునే ఛాన్స్ కూడా ఉన్నట్లు సెక్రటేరియట్ లోని ఓ అధికారి తెలిపారు.

Also Read: ఇందిరమ్మ చీర రంగును మార్చిన సర్కార్.. ఇకపై చీరలన్నీ ఆ కలర్‌లోనే..?

Related News

మద్దతు ఉంటే సరిపోదు.. అది ఓటుగా మారాలి.. క్యాడర్‌కు కోమటిరెడ్డి క్లాస్!

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్.. షోకాజ్ నోటీసులు జారీ

అందినకాడికి దోచేసి.. ఇప్పుడు నీతులు చెప్తారా? హరీష్ రావుపై ఎమ్మెల్యే గండ్ర ఫైర్!

చిన్నారి ప్రాణానికి రూ. 1.5 కోట్ల ఇంజెక్షన్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం!

‘దోచుకోవడం, దాచుకోవడం మీ నైజం’.. హరీశ్ రావు ఆరోపణలపై మంత్రి అడ్లూరి సంచలన కౌంటర్!

హైదరాబాద్‌ వాన బీభత్సం.. సీఎం రేవంత్ రెడ్డి విమానం దారి మళ్లింపు.. ఎక్కడికంటే?

తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త యాక్షన్ ప్లాన్.. రంగంలోకి బూత్ లెవల్ ఏజెంట్లు!

హెల్త్ కార్డుల ఇష్యూపై వెనక్కి తగ్గేదే లేదు.. ప్రభుత్వానికి బీఆర్ఎస్ అల్టిమేటం!

Big Stories

Advertisement
×