E-Paper
Advertisement

బోర్డర్ చెకింగ్ పేరిట వసూళ్లు.. లారీ డ్రైవర్‌ స్టింగ్ ఆపరేషన్, వెలుగులోకి తెచ్చిన ‘బిగ్‌టీవీ’

బోర్డర్ చెకింగ్ పేరిట వసూళ్లు..  లారీ డ్రైవర్‌ స్టింగ్ ఆపరేషన్, వెలుగులోకి తెచ్చిన ‘బిగ్‌టీవీ’
Advertisement

Kamareddy: డ్యూటీ పేరుతో వసూళ్ల పర్వానికి తెరలేపాడు ఎక్సైజ్ కానిస్టేబుల్. ఫలితంగా ఓ లారీ డ్రైవర్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి తీసుకొచ్చింది ‘బిగ్ టీవీ’. ఫలితంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ అడ్డంగా బుక్కయ్యాడు. సదరు కానిస్టేబుల్‌పై శాఖాపరమైన విచారణ మొదలైంది. ఇంతకీ ఎక్కడో తెలుసా?

కామారెడ్డిలో బోర్డర్ పేరిట వసూళ్ల పర్వం-కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్‌పూర్ ఎక్సైజ్ చెక్‌పోస్ట్ వద్ద వసూళ్ల దందాను వెలుగులోకి తీసుకొచ్చింది ‘బిగ్ టీవీ’. బోర్డర్ చెకింగ్ పేరిట వాహనాలను ఆపి అక్రమ వసూళ్లకు తెరలేపాడు ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ కానిస్టేబుల్. ఆ ప్రాంతానికి ఏదైనా వాహనం వచ్చిందంటే చాలు..  ఆ చెక్ పోస్టు వద్ద కప్పం కట్టాల్సిందే. లేకుంటే వాహనాలు ముందుకు వెళ్లవు.

Advertisement

సలాబత్‌పూర్ ఎక్సైజ్ చెక్‌పోస్ట్ –వచ్చిన ప్రతీసారీ సదరు కానిస్టేబుల్‌కు కప్పం కట్టలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడిన సందర్భాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఈ తతంగాన్ని ఓ లారీ డ్రైవర్ జాగ్రత్తగా స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టాడు. దీంతో ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ‘బిగ్ టీవీ’. నేమ్ బ్యాడ్జ్ లేకుండా లారీలను ఆపి డబ్బులు డిమాండ్ చేసినట్లు వాహనదారులు ఆరోపణ చేశారు.

వెలుగులోకి తెచ్చిన ‘బిగ్‌టీవీ’- ఓ లారీ డ్రైవర్‌ స్టింగ్ ఆపరేషన్- ఓ లారీ డ్రైవర్ వసూళ్ల పర్వాన్ని వీడియో తీస్తూ సదరు కానిస్టేబుల్‌ను నిలదీశాడు. చివరకు మాట మార్చడం కానిస్టేబుల్ వంతైంది. ఆ స్ట్రింగ్ ఆపరేషన్‌లో ఓ వాహనదారుడి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు దృశ్యాలు కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా చెక్‌పోస్ట్‌లను ఎత్తివేసింది రాష్ట్ర ప్రభుత్వం.

Advertisement

కానీ, కానిస్టేబుల్ మాత్రం బోర్డర్ పేరిట వసూళ్లకు తెరలేపాడు. ఈ వీడియో ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై ప్రాథమిక విచారణకు ఆదేశించారు ఆ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద్ రెడ్డి. ప్రాథమిక విచారణలో కానిస్టేబుల్ సుధాకర్‌రెడ్డి బాధ్యుడిగా గుర్తించారు. అతడి సస్పెన్షన్‌కు ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం.

ALSO READ: ఫలించని ట్రీట్‌మెంట్..BRS మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి, కేసీఆర్ సంతాపం

అంతర్రాష్ట్ర సరిహద్దులో అక్రమ మద్యం-గంజాయి రవాణా నిరోధానికి చెక్‌పోస్ట్ పని చేస్తోందని చెప్పుకొచ్చారు అధికారులు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం సహించబోమని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ వసూళ్లు ఎవరైనా పాల్పడితే ‘బిగ్‌టీవీ’ దృష్టికి తీసుకురండి. ఎవరికి తలొగ్గం..ఎవరికి మేము అతిథులం కాదు.

 

 

Related News

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

Big Stories

Advertisement
×