E-Paper
Advertisement

Devi Sri Prasad : దేవిశ్రీ ప్రసాద్‌పై కంప్లైంట్.. సైబర్ క్రైంకు కరాటే కల్యాణి..

Devi Sri Prasad : దేవిశ్రీ ప్రసాద్‌పై కంప్లైంట్.. సైబర్ క్రైంకు కరాటే కల్యాణి..
Advertisement

Devi Sri Prasad : రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. సూపర్ హిట్ సంగీత దర్శకుడు. మంచి బీట్ ఉన్న మ్యూజిక్ కొట్టడంలో ఎక్స్ పర్ట్. వందలాది సినిమాలతో వేలాది హిట్ సాంగ్స్ అందించారు. అప్పుడప్పుడు ఆయనపై కాపీ కాట్ ఆరోపణలు వచ్చినా.. బ్లాక్ బస్టర్లతోనే సమాధానం చెప్పారు. లేటెస్ట్ గా దేవీశ్రీ ప్రసాద్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందడం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది.

హిందూ మనోభావాలు దెబ్బతీశారంటూ దేవీశ్రీపై సైబర్ క్రైమ్ పీఎస్ లో కంప్లైంట్ చేశారు. చేసింది ఎవరనుకున్నారు.. కరాటే కల్యాణి. ఆమెతో పాటు పలు హిందూ సంఘాలు కూడా ఉన్నాయి.

Advertisement

హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని ‘ఓ పారి’ ఆల్బమ్‌లో ఐటెం సాంగ్‌ గా మార్చేశారని.. అందుకుగాను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలనేది ఆ ఫిర్యాదు సారాంశం. పవిత్రమైన ఆ మంత్రాన్ని అశ్లీల దుస్తులు, అశ్లీల డ్యాన్సులతో ఆల్బమ్ క్రియేట్ చేసి.. హిందు మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. వెంటనే ఆ సాంగ్ లో వినిపించే మంత్రాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు.

‘ఓ పారి’ ఆల్బమ్ ను తెలుగులో ‘ఓ పిల్లా’ పేరుతో తీసుకొచ్చారు. పలు భాషల్లో రిలీజ్ చేశారు. గత నెలలోనే ఈ ఆల్బమ్ విడుదల చేయగా.. అప్పట్లోనే ఈ పాట బాగా వివాదాస్పదమైంది. పలువురు తప్పుబట్టారు. తాజాగా, కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పీఎస్ లో కంప్లైంట్ చేశారు. ఈ మధ్య పలు వివాదాల్లో కరాటే కల్యాణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అది అలవాటుగా మారిందో.. లేక, వివాదం చేయాలనో.. కారణం ఏదైనా కరాటే కల్యాణి దేవిశ్రీ ప్రసాద్ పై ఫిర్యాదు చేయడం ఆసక్తికరం.

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×