BigTV English

Telangana : కవిత లేదు.. భవిత లేదు.. చాలు చాల్లేమ్మా!

Telangana : కవిత లేదు.. భవిత లేదు.. చాలు చాల్లేమ్మా!

Telangana : సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు. కేబినెట్ ఆమోదముద్ర. ఈ డెసిషన్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. కులగణన లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించి రాష్ట్రంలో మెజారిటీ వర్గాన్ని అందలం ఎక్కించే కార్యక్రమం మొదలైపోయింది. ఇన్నాళ్లూ బీసీ వాయిస్ వినిపిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసిన కొందరికి ఈ నిర్ణయం ఊహించని పరిణామమే. తీన్మార్ మల్లన్న, కల్వకుంట్ల కవిత లాంటి వాళ్లు ఈ క్రెడిట్ తమదేనంటూ ఖాతాలో వేసుకుంటున్నారు.


ఎమ్మె్ల్సీ కవిత. కొంతకాలంగా బీసీ నినాదం, సామాజిక తెలంగాణం అంటూ జాగృతి జెండా కింద సరికొత్త రాజకీయం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో దొరల్లా పాలించి.. ప్రభుత్వం పోయాక బడుగుల అజెండా ఎత్తుకోవడం కవితకే చెల్లిందనే విమర్శ ఉంది. పూలే విగ్రహం కోసమూ ధర్నాలు చేస్తున్నారామె. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టడం, బీసీల గణాంకాలు తేల్చడం.. లేటెస్ట్‌గా 42 శాతం రిజర్వేషన్లపై కేబినెట్ నిర్ణయంతో ఉలిక్కిపడిన కవితక్క.. ఇదంతా తన క్రెడిటే అంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలపడం జాగృతి విజయం అన్నారు కవిత. తాము తలపెట్టిన రైల్‌ రోకో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే కచ్చితంగా నిరసన తెలుపుతామన్నారు. ఆర్డినెన్స్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదన్నారు. ఆర్డినెన్స్‌తో పాటు చట్టబద్దత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్, బీసీ నాయకులతో సమావేశమై తదుపరి కార్యచరణ రెడీ చేస్తున్నారు కవిత.


మరోవైపు, బీఆర్ఎస్ బీసీ లీడర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం స్పందించారు. ఆర్డినెన్స్ పేరుతో మంత్రివర్గం చేతులు దులుపుకుందన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలపైన తమకు అనేక అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేశారు.

తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు షురూ అవడంతో టీపీసీసీ చీప్ మహేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. అసలు కవిత కౌన్ కిస్కా..? కవిత లేదు.. భవిత లేదు.. అంటూ అటాక్ స్టార్ట్ చేశారు. తమ ప్రభుత్వం చేసిన దానికి కవిత రంగులు పూసుకోవడం ఏంటి? చోటా మోటా ధర్నాలు చేసి తన వల్లే అయింది అనడం ఏంటి? బీసీ రిజర్వేషన్లకు కవితకి సంబంధం లేదు.. ఆమె ప్రమేయం లేదు.. కవితను చూసి జనాలు నవ్వుకుంటున్నారు.. అంటూ విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు రాహుల్ అజెండా, రేవంత్ కమిట్మెంట్ అని తేల్చి చెప్పారు.

పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలన్న కేబినెట్ నిర్ణయాన్ని బీసీల తరుపున స్వాగతిస్తున్నామన్నారు ఆది శ్రీనివాస్. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించకపోవడంపై మండిపడ్డారు. గతంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీలు నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పాల్గొనలేదని మండిపడ్డారు. బీసీలపై ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదన్నారు. కవితకు బీసీలకు ఏం సంబంధం లేదన్నారు. పదేళ్ల అధికారంలో ఏనాడూ బీసీల ఊసెత్తలేదని తెలిపారు.

ఇలా కవిత ఎపిసోడ్‌పై కాంగ్రెస్ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది. అంటే కవితను సైతం కాంగ్రెస్ ప్రత్యర్థిగా భావిస్తోందా? కవిత చేసిన బీసీ పోరాటాన్ని గుర్తించినట్టేనా? బీఆర్ఎస్‌కు పోటీగా జాగృతిని ఎంకరేజ్ చేస్తున్నారా? బీసీ రిజర్వేషన్ల క్రెడిట్ 100 శాతం కాంగ్రెస్ సర్కారుదే కాబట్టి.. దానిని కవిత క్లెయిమ్ చేసుకోవడంపై మండిపడుతున్నారా? బీసీ రేసులో బీఆర్ఎస్, బీజేపీ పత్తా లేకుండా పోయాయా? కాంగ్రెస్ గేమ్ ఛేంజర్‌గా నిలిచిందా?

Related News

IAS officers: రాష్ట్రంలో అయిదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

Rain News: మూడు రోజులు అతిభారీ వర్షాలు.. ఈ ప్రాంత వాసులు బయటకు వెళ్లొద్దు.. పిడుగులు పడే అవకాశం!

Teachers Stuck in School: ఉద్ధృతంగా వాగు ప్రవాహం.. రాత్రంతా బడిలోనే టీచర్లు!

TGSRTC Special Buses: బ‌తుక‌మ్మ‌, దసరాకు.. TGSRTC 7,754 ప్రత్యేక బస్సులు..

Weather News: రాష్ట్రంలో ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం.. నాన్ స్టాప్ రెయిన్స్.. ముందే ప్లాన్ చేసుకోండి

Mulugu Tribal Farmers: కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన గిరిజన రైతులు..

Etela Rajender: ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు..

British High Commissioner: బ్రిటీష్ హైకమిషనర్ లిండి కామెరాన్‎తో.. సీఎం రేవంత్ కీలక భేటీ

Big Stories

×