కూయిలీకి వంట నేర్పిస్తున్నట్టు నటిస్తూనే కొడుతుంది కావ్య.. ఏంటి బామ్మ కొడుతున్నారు అని కూయిలీ అడిగితే ఆ కూరగయలు ఎలా కట్ చేస్తున్నావే అంటుంది. దీంతో కూయిలీ నువ్వు చెప్పినట్టే కట్ చేస్తున్నాను కదా బామ్మ అంటుంది. తర్వాత కావ్య హాల్లోకి వెళ్తుంది. హాల్లో కూర్చున్న రాజ్, రాహుల్‌ను ఏరా మనవడా అని పిలుస్తుంటే.. నువ్వు అలా పిలవకు నాకు చిరాకుగా ఉందని అంటాడు. వాళ్ల మాటలు విన్న కావ్య చిరాకు ఎందుకురా గడుగ్గాయి.. తాత మనవడిని మనవడా అని పిలవకుండా గైవడా పిలుస్తాడురా నీ జిమ్మడా..? అంటుంది. దీంతో రాహుల్ కోపంగా ఏహేయ్ ఆపండి మీ గోల అంటాడు. దీంతో రాజ్ ఏడ్చావులే కానీ నీకో గుడ్ న్యూస్‌రా అని చెప్తాడు. దీంతో రాహుల్ మీరుండగా నాకు గుడ్ న్యూస్ కూడానా..? అంటాడు. దీంతో రాజ్ నిజమేరా మనవడా నీకు కజీన్ వస్తున్నాడు.. అని చెప్పగానే.. రాహుల్ కజీనా..? అని అడగ్గానే.. అదేరా వాడు గోల్డెన్ బాబురా.. దుబాయ్ రిటర్న్ అని చెప్పగానే..
ఎవ్వరూ రానక్కర్లేదు అని రాహుల్ చెప్పగానే.. ఏరా నీ కాబోయే పెళ్లాం పర్మిషన్ కావాలా ఏంటి..? అని అడుగుతుంది. ఇంతకీ నీ గ్యాల ఎక్కడరా అని రాజ్ అడగ్గానే.. కిచెన్ లోంచి కూయిలీ ఏంటి తాతయ్య గారు అంటూ వస్తుంది. కూయిలీని చూసిన రాహుల్ షాక్ అవుతాడు.. కూయిలీ ఏంటి ఇలా అయిపోయావు అని అడగ్గానే.. వంట చేసిందిరా మనవడా..? ఈ మాత్రం చేంజ్ వస్తుందిలే..? అని కావ్య చెప్పగానే.. అది వంట చేసినట్టు లేదు.. నువ్వు దాని తాట తీసినట్టు ఉంది అంటాడు రాజ్. ఇంతలో కూయిలీ ఏంటి రాహుల్ అలా చూస్తున్నావు.. అని అడగ్గానే.. అదే నువ్వు మరీ ఇంత చెండాలంగా ఉన్నావేంటా అని చెప్తాడు. ఏరా రాహుల్ దాని వర్జినల్ అదే.. అంటూ కావ్య చెప్తుంది. అయినా ప్రేమించిన దాని అందం చూస్తావురా..? దాని ఆస్తి చూడాలి కానీ అంటాడు రాజ్. ఓరేయ్ రాహుల్ ఇది ఇష్టం లేకపోతే చెప్పరా..? వెళ్లిపోదాం.. అంటుంది కావ్య.
బామ్మ గారు నేను వెళ్లి స్నానం చేశానంటే అప్సరసలా ఉంటాను తెలుసా..? అనగాఏ.. అదంతా తర్వాత నువ్వు వెళ్లి రెడీ అవ్వవా అంటాడు రాహుల్.. అసలే నా గోల్డ్ బాబు వస్తున్నాడు వాడికి ఇదంతా నచ్చదు అంటాడు రాజ్.. ఇంతకీ గోల్డ్ బాబు ఎవరు అని రంజిత్ అడుగుతాడు. ఎవరైతే ఏంటి..? పేరులోనే గోల్డ్ ఉంది అని కూయిలీ హ్యపీగా ఫీలవుతుంది. ఇంతలోనే గోల్డ్ బాబు వచ్చి హడావిడి చేస్తుంటాడు. ఆ హడావిడికి రాహుల్ కంగు తింటాడు. గోల్డ్ బాబు తనకు కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పడంతో కూయిలీ షాక్ అవుతుంది. దీంతో రాజ్ ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా ఏం లాభంరా మన ఇండియాకు దూరం అయిపోయావు కదా..? అంటాడు.. లేదు తాతయ్య అక్కడి ఆస్తులన్నీ తీసుకుని వచ్చేశాను.. నేను ఇక్కడే ఒక కంపెనీ పెట్టుకుని మరో కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నాను ఇప్పుడు మంచి పార్ట్‌నర్ కోసం వెతకాలనుకుంటున్నాను.. అని చెప్పగానే.. కూయిలీ నవ్వుతూ మీరు వెతకాల్సిన పని లేదు గోల్డ్ బావగారు.. మేమే ఉన్నాము.. మా కంపనీలో పెట్టుబడి పెట్టండి.. మీ కంపెనీ మా చేతిలో పెట్టండి అంటుంది కూయిలీ..
దీంతో రాహుల్ ఇది మరీ కొంచెం ఓవర్ గా లేదూ అంటాడు. దీంతో గోల్డ్ బాబు రాహుల్‌ను కొడుతూ ఊరుకోరా.. నీకు కాబోయే పెళ్లాం అంత ఇదిగా అడుగుతుంటే… కాదని ఎలా అంటాను చెప్పు అనగానే.. కూయిలీ కరెక్టుగా చెప్పారు బావగారు అంటుంది. దీంతో కూయిలీని మెచ్చుకుని తన చేతికి ఉన్న రింగ్ ఇస్తాడు. దీంతో కూయిలీ.. గోల్డ్ బాబును రూంలోకి తీసుకెళ్తుంది. అక్కడ తన దగ్గర ఉన్న గోల్డ్ చూపించగానే.. కూయిలీ వెంటనే షాక్ అవుతుంది. రాహుల్ బయటకు వెళ్లి రుద్రాణికి ఫోన్ చేసి రాజ్, కావ్య ఆడుతున్న నాటకం గురించి చెప్తాడు. వాళ్లను ఎలాగైనా అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేయమని అడుగుతాడు. దీంతో రుద్రాణి కోపంగా గంటలో వాళ్లిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేస్తాను అని చెప్తుంది.
మరోవైపు ఆఫీసలో ఉన్న శృతి ప్రాజెక్టు రిపోర్టు కనిపించడం లేదని టెన్షన్ పడుతుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ కూర్చుని రాజ్, కావ్య ల గురించి వాళ్లు ఆడుతున్న నాటకం గురించి ఆలోచిస్తుంటారు.. ఇంతలో శృతి, సుభాష్‌కు ఫోన్ చేసి ప్రాజెర్టు రిపోర్డు కనిపించడం లేదని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.