E-Paper
Advertisement

Adilabad Airport: దశాబ్దాల కల నెరవేరే ఛాన్స్.. ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి దిశగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Adilabad Airport: దశాబ్దాల కల నెరవేరే ఛాన్స్.. ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి దిశగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
Advertisement

Adilabad Airport: ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం అభివృద్ధి కోసం 700 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ను వెంటనే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సమన్వయంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అమలు చేయనున్నారు.

ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు సాధ్యమని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సమర్పించిన సాంకేతిక-ఆర్థిక అధ్యయన నివేదిక (Techno-Economic Feasibility Report)లో నిర్ధారించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జాయింట్-యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌ గా దీనిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

Advertisement

ఆదిలాబాద్ విమానాశ్రయం రూపుదిద్దుకుంటే.. ఇది ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది. మహారాష్ట్ర సరిహద్దులకు దగ్గరగా ఉన్న ఈ జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు వల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా.. ఈ ప్రాజెక్టు ద్వారా ఆర్థికాభివృద్ధి, పర్యాటకం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

ALSO READ: Dog Bite Victims: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక మలుపు.. బాధితుల జోక్యానికి గ్రీన్ సిగ్నల్!

Advertisement

విమానయాన సదుపాయం మెరుగుపడటం వలన ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. పర్యాటక రంగానికి కూడా కొత్త గుర్తింపు లభించే అవకాశం ఉంది. అత్యవసర వైద్య సేవలు, విపత్తు ప్రతిస్పందన వంటి అత్యవసర సేవల మౌలిక వసతులు సైతం బలోపేతం అవుతాయి. ఈ విమానాశ్రయం ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు దేశీయ విమానయాన పటంలో కొత్త, బలమైన గుర్తింపు లభించనుంది.భూసేకరణ ప్రక్రియ వేగవంతం అయిన తర్వాత.. AAI తదుపరి నిర్మాణ పనులను ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల కల త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది.

ALSO READ: Jagityala News: రూ.50 లేక తల్లిని భుజాన మోసిన కుమారుడు.. కన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనం

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×