E-Paper
Advertisement

Kavitha Missing: కవిత కనబడుటలేదు.. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు

Kavitha Missing: కవిత కనబడుటలేదు.. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు
Advertisement

అయితే.. ఇటీవల ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యారు కవిత. అయినా.. నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజా సొమ్ముతో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు.. కానీ.. ప్రజా సమస్యలను మాత్రం గాలికొదిలేస్తున్నారు.. అంటూ కవితపై భగ్గుమంటున్నారు.

Advertisement

నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత ఎన్నికైన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కానీ వ్యక్తిగత కేసులో గత ఐదు నెలల నుంచి తీహార్ జైలులో ఉన్న కవిత ఇటీవల బెయిల్‌తో బయటకి వచ్చారు. సుమారు నెలన్నర  పైగా నిజామాద్‌కు వెళ్లలేదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్సీ కవిత వారి సాధక భాధకాలు కూడా వినాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు నిజామాబాద్ వెళ్లక పోవడంతో కొంత మంది కాంగ్రెస్ నాయికులు, తెలంగాణా ఉద్యమకారులు ఆదే ప్రవీణ్ కుమార్, కోనేటి సాయికుమార్, ఈర్ల శేఖర్ శనివారం వన్ టైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: అప్పుడే స్పందించి ఉంటే ఇప్పుడు ‘హైడ్రా’బాద్ ఉండునా ?

Advertisement

ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సౌకర్యాలు పొందుతున్న ఆమె మా బాధలను కూడా పట్టించుకోవాలని, ప్రజలకు సేవ చేయాల్సిన కనీస బాధ్యత ఆమె నిర్వహించకుండా ఖాళీగా ఉండటం కరెక్టు కాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. లిక్కర్ కేసులో బెయిల్‌పై విడుదలైనా కూడా ఆమె జిల్లాలో కనిపించడం లేదన్నారు. ఆమెను వెతికి జిల్లా ప్రజల ముందు ఉంచాలని కోరారు.

ఇక మధ్యం కుంభకోణం కేసులో నిందుతురాలుగా ఉన్నఎమ్మెల్సీ కవిత దాదాపు ఐదు నెలలపాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించి, ఇటీవల ఆగష్టు 27న సుప్రీంకోర్టు బెయిల్ మంజురు చేసిన సంగతి తెలిసిందే.

Related News

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముందు.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ..

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

Big Stories

Advertisement
×