BigTV English

Bigg Boss 8 Telugu Promo: నిఖిల్, సోనియా వ్యవహారంపై నాగ్ రియాక్షన్.. వాళ్లను నమ్ముకొని వెనకబడిన చీఫ్

Bigg Boss 8 Telugu Promo: నిఖిల్, సోనియా వ్యవహారంపై నాగ్ రియాక్షన్.. వాళ్లను నమ్ముకొని వెనకబడిన చీఫ్

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయ్యి దాదాపు నెల రోజులు అవుతోంది. దీంతో కంటెస్టెంట్స్ ఎలాంటివారు, వారి మనస్తత్వం ఏంటి అనే విషయాలు తోటి కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్‌కు కూడా అర్థమయ్యింది. ఇక నాగార్జునకు కూడా ఈ విషయంపై క్లారిటీ వచ్చినట్టుంది. అందుకే మొదటిసారి పలువురు హౌస్‌మేట్స్ చేస్తున్న తప్పులను వేలెత్తి చూపించారు. అందులోనూ ముఖ్యంగా నాగ మణికంఠ, నిఖిల్ ప్రవర్తన ఎలా ఉంటుందో వారికే అర్థమయ్యేలా చెప్పారు. ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లో హీరో ఎవరు, జీరో ఎవరు అనే విషయాన్ని హౌస్‌మేట్స్ డిసైడ్ చేయనున్నారు. దానికి సంబంధించిన ఎపిసోడ్ తాజాగా విడుదలయ్యింది.


సీత ఒక హీరో

‘‘ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు.. హీరో, జీరో’’ అంటూ ఆ ఆట గురించి నాగార్జున వివరించడంతో బిగ్ బాస్ ప్రోమో మొదలయ్యింది. దీంతో మణికంఠ ముందుకొచ్చి తనకు హీరో అంటే సీత అని తన తలపై కిరీటాన్ని పెట్టాడు. ఇది చూసిన నాగార్జున.. సీత తనకు కూడా హీరోలాగానే కనిపిస్తుందని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత నబీల్ వచ్చి పృథ్వికి హీరో అంటూ కిరీటం ఇచ్చాడు. ‘‘మూడు గంటలు మొహం మీద చిరునవ్వు పోకుండా ఉన్నావు. నువ్వు నా డొపోమైన’’ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా పృథ్వి విషయంలో విష్ణుప్రియాకు కౌంటర్ ఇచ్చారు నాగార్జున. దీంతో విష్ణుప్రియా తన స్టైల్‌లో నవ్వింది. ఆ తర్వాత వచ్చిన ఆదిత్య.. నిఖిల్‌ను హీరో చేశాడు.


Also Read: నబీల్ ప్రేయసిని చూశారా? ఎంత క్యూట్ గా ఉందో.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

మణి జీరో

హీరోల గురించి చర్చ ముగిసిన తర్వాత ఆటలో జీరో అవుతున్న వారి మొహంపై స్టాంప్ వేయాలని నాగార్జున అన్నారు. అందులో ముందుగా వచ్చిన ఆదిత్య ఓం.. జీరో ఎవరో చెప్పడం కష్టమని, తనకు అందరూ ఇష్టమే అని అన్నాడు. ఆ తర్వాత మణికంఠ వచ్చి నైనికాకు జీరో అని స్టాంప్ వేశాడు. అది చూసిన నాగార్జున.. 200 శాతం కరెక్ట్ అని చెప్పారు. ఆపై నబీల్, నైనికా, పృథ్వి, సోనియా.. ఇలా అందరూ మణికంఠనే జీరో అన్నారు. ‘‘సపోర్ట్ చేసేవాళ్లనే ఇంటి నుండి బయటికి పంపాలని చూస్తాడు’’ అంటూ నబీల్ కారణం చెప్పాడు. ‘‘చాలా అబద్ధాలు చెప్తాడని అనిపిస్తోంది’’ అని మణిపై అభిప్రాయం వ్యక్తం చేశాడు పృథ్వి. దీంతో ‘‘ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు’’ అని మణిని అడిగారు నాగార్జున. అది తనకు కూడా అర్థం కావడం లేదని మణి అన్నాడు.

తనే కారణం

ప్రేరణ వచ్చి నిఖిల్‌కు జీరో స్టాంప్ వేసింది. ‘‘హౌస్ అంతా కలిసికట్టుగా ఆడాలి అన్నా కూడా తన టీమ్‌కు ప్రాధాన్యత ఇచ్చి హౌస్‌ను పక్కన పడేశాడు అనిపించింది’’ అని కారణం చెప్పింది ప్రేరణ. ‘‘నీకే కాదు నాకు అనిపించింది, సీతకు అనిపించింది’’ అన్నారు నాగార్జున. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్‌లో అసలు నబీల్‌ను ఎందుకు తీసేశారని నిఖిల్‌ను అడిగారు. అయితే తనకు మిస్ బ్యాలెన్స్ అయ్యిందని నిఖిల్ సమాధానమివ్వగా.. ‘‘మిస్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం’’ అంటూ నవ్వారు నాగ్. ‘‘నువ్వు చీఫ్‌గా ఉన్నప్పుడు హౌస్ అంతా నీ టీమ్‌కు రావడానికి ఇష్టపడలేదు. అది ఎందుకు అని ఆలోచించావా?’’ అని అడిగారు. ‘‘ఏం చేసినా మేము ముగ్గురమే కలిసి చేసుకుంటున్నామని ఫీలవుతున్నారు’’ అని నిఖిల్ చెప్పగా.. హౌస్ అంతా నిజమే అని ఒప్పుకుంది.

Related News

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Big Stories

×