
Congress Party DAC Suspended Bakka Judson(Telangana today news): మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బక్క జడ్సన్‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ డిసిప్లీనరీ కమిటీ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి మంగళవారం అతన్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కాగా గత నెల 27న బక్క జడ్సన్‌కు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మార్చి 30న జడ్సన్ తన వివరణ ఇచ్చారు. జడ్సన్ వివరణతో సంతృప్తి చెందని డీఏసీ కమిటీ, అతన్ని ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.