
Congress Rebels Nomination : తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం ముగిసింది. ఈ క్రమంలో రెబల్ అభ్యర్థులను బుజ్జగించడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సక్సెస్ సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు కాంగ్రెస్ నేతలు రెబల్‌గా ఇండిపెండెంట్ నామినేషన్లు దాఖలు చేశారు.
పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు మద్దతు ఇచ్చేది లేదని.. తాము ఎట్టిపరిస్థితుల్లో పోటీలో ఉంటామని రెబల్ నేతలు స్పష్టం చేశారు. దీంతో అధికారమే లక్ష్యంగా వ్యుహాలు రచిస్తున్న కాంగ్రెస్‌కు రెబల్ నేతలు కొత్త సమస్యగా మారారు. రెబల్ లీడర్లు నామినేషన్లు విత్ డ్రా చేసుకోకపోతే పార్టీ ఓట్లు చీలి బీఆర్ఎస్‌కు లాభం చేకూరే అవకశం ఉంది. ఈ సమస్యపై కాంగ్రెస్ అదిష్ఠానం సీరియస్‌గా దృష్టి సారించింది.
నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజే చివరి తేదీ కావడంతో రెబల్ నేతలను బుజ్జగించేందుకు రంగంలోకి కాంగ్రెస్ బడా నాయకులను దింపింది. ఎలాగైనా రెబల్ నేతలను నచ్చజెప్పి.. నామినేషన్ విత్ డ్రా చేయించాలని ఆదేశించింది. ఈ ప్రయత్నంలో ఈ కాంగ్రెస్ దూతలు రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతల చేత నామినేషన్లు విత్ డ్రా చేయించారు.
బరిలో నుంచి తప్పుకున్న కొందరు నేతలకు డీసీసీ అధ్యక్ష పదవులు, మరికొందరికి ఎంపీ టికెట్ల ఇస్తామని కాంగ్రెస్ తరపున హామీ లభించింది. అలాగే మరికొంతమందికి ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవుల హామీ లభించడంతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు.
అలా నామినేషన్ విత్ డ్రా చేసిన రెబల్ నేతలలో సూర్యాపేట నుంచి పటేల్ రమేశ్ రెడ్డి, బాన్సువాడ నుంచి కాసుల బాలరాజు, డోర్నకల్ నుంచి నెహ్రూ నాయక్, వరంగల్ వెస్ట్ నుంచి జంగా రాఘవరెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి దండెం రాంరెడ్డి, జుక్కల్ నుంచి సౌదాగర్ గంగారం ఉన్నారు.
.
.
.