
Devarakadra : దేవరకద్రలో విజయం తనదే అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి జి.మధుసూదన్ రెడ్డి. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో తన విజయావకాశాలు గురించి వివరంగా చెప్పారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చాలా మంది చేరుతున్నారని చెప్పారు. వారంతా జీఎంఆర్‌ను గెలిపించాలనే లక్ష్యంతో ఉన్నారని స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హ్యాట్రిక్ పగటికల మాత్రమేనని జీఎంఆర్ స్పష్టం చేశారు. అవినీతిలో రాష్ట్రస్థాయిలో ఈ ఎమ్మెల్యే టాప్-10లో ఉన్నారని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ నాయకులు పార్టీని వీడుతున్నారని తెలిపారు.సీతా దయాకర్‌రెడ్డి లాంటి వాళ్ల మద్దతు తనకుందని చెప్పారు. అలాగే చిన్నారెడ్డి కూడా ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
దేవరకద్రలో సీఎం కేసీఆర్ సభ వెలవెలబోయిందని ..సభలో జనం అరగంట కూడా కూర్చోలేదన్నారు జీఎంఆర్.ఆలోచన చేసి మంచి వ్యక్తికే ఓటెయ్యండని సీఎం అన్నారని..తన అభ్యర్థి మంచోడు అని కేసీఆర్ చెప్పలేకపోయారన్నారు. చిన్నారెడ్డి ఆదర్శంగా రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ వాళ్లు కాపీ కొట్టారని ఆరోపించారు ఈ విషయం ప్రజలకు కూడా అర్థమైందన్నారు.
.
.
Anam: ప్రాజెక్టులు కట్టామా? పనులు చేశామా?.. జగన్ కు ఫుల్ డ్యామేజ్.. ఆనం పార్టీ మారుతారా?