E-Paper
Advertisement

Patnam Mahender Reddy: రంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం : పట్నం మహేందర్ రెడ్డి!

Patnam Mahender Reddy: రంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం : పట్నం మహేందర్ రెడ్డి!
Advertisement

Patnam Mahender Reddy: మేడ్చల్ స్వేచ్ఛ: మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని శాసన మండలి ప్రభుత్వ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో 3, చేవెళ్ల నియోజకవర్గంలో 3 స్థానాలు, అలాగే పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్ గడి మలక్పేట్‌లో శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి , డిసిసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

Also Read: BRS Party: గులాబీ పార్టీలో బిగ్ ట్విస్ట్.. త్వరలో హరీష్ రావుకు బీఆర్ఎస్ పగ్గాలు.. మరి కేటీఆర్..?

పని చేసే నాయకులకు ఓటు వేయాలి 

Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కష్టపడి పని చేసే నాయకులకు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న 6 గ్యారంటీల పథకాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఉచిత విద్యుత్ పథకం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి పథకాలు ప్రజలకు చేరువయ్యాయని తెలిపారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు కూడా బాధ్యతగా చేపడతామని అన్నారు.మాయ మాటలు చెప్పే వారిని ప్రజలు నమ్మవద్దని హెచ్చరించారు.

అనంతరం వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పే మాయ మాటలను ప్రజలు నమ్మరని డిసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ విమర్శించారు.మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు.మూడు మున్సిపాలిటీలు కాంగ్రెస్ హస్తగతమే అని ధీమా వ్యక్తం చేశారు.ధన రాజకీయాలకు మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాలను వ్యాపారంగా మార్చారని విమర్శించారు.మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మల్లారెడ్డి మాయ మాటలను నమ్మవద్దని కోరారు.ఈ కార్యక్రమంలో కొలను హనుమంత్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, పీసరి మైపాల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్ధి కంటం సిరిషా కృష్ణారెడ్డి, ఆర్టిఏ మెంబర్ జైపాల్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read:Vinod Khanna: రోజుకు 80 సిగరెట్లు.. స్టార్ హీరో భార్య సంచలన కామెంట్స్, అందగాడి జీవితంలో అంధకారం

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×