BigTV English

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులిచ్చిన కోర్టు.. ఎందుకంటే ?

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులిచ్చిన కోర్టు.. ఎందుకంటే ?

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు ఇచ్చింది. బీజేపీపై రేవంత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నోటీసులు కోర్టు జారీ చేసింది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో బీజేపీపై సీఎం రేవంత్ విమర్శలు చేశారు. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని ఆరోపించారు. అంతే కాకుండా రేవంత్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు వేసారు.


బీజేపీ నేత దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో  రేవంత్ రెడ్డి బీజేపీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగించనుందని ప్రచారం చేశారు. అంతే కాకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో వైరల్ చేయడంతో పాటు బండి సంజయ్ తదితర బీజేపీ నేతలను అసభ్య పదజాలంతో దూషించడంతో రేవంత్ రెడ్డి పరువు నష్టం కలిగించారంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు , అజయ్ కుమార్ తదితరులు నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు.

Also Read: ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత..ఎయిమ్స్‌కు తరలింపు


ఈ ఫిర్యాదును కోర్టు స్వీకరించకపోవడంతో హై కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం వీలైనంత త్వరగా సదరు ప్రైవేటు ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని స్థానిక కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నాంపల్లిలోని స్పెషన్ జ్యుడీషియన్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు బీజేపీ నేతలు దాఖలు చేసిన పరువు నష్టం కేసు ఫిర్యాదుపై విచారణ చేపట్టి సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×