BigTV English

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత..ఎయిమ్స్‌కు తరలింపు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత..ఎయిమ్స్‌కు తరలింపు

MLC Kavitha Admit in AIIMS(Political news in telangana): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గైనిక్ సమస్యతోపాటు వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. ఈ మేరకు జైలు డాక్టర్ల సిఫార్సు మేరకు వైద్య పరీక్షల నిమ్మిత్తం ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


ప్రస్తుతం కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని జైలు అధికారులు తెలిపారు. కాగా, కవిత గత కొంతకాలంగా గైనిక్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జూలై 16న కూడా అస్వస్థతకు గురైంది. ప్రస్తుతం కవిత తీవ్ర జ్వరం, నీరసంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. మళ్లీ అనారోగ్యం బారిన పడడంతో పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత గత 5 నెలలుగా జైలులోనే ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 27కు వాయిదా వేసింది. అయితే బెయిల్ పిటిషన్‌పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.


Also Read: ఈడీ ఆఫీసు.. కాంగ్రెస్ నేతల ధర్నా, అదానీ వ్యవహారం తేల్చాలంటూ..

ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న హైదరాబాద్‌లో ఎన్ ఫోర్స్ మెంట్ డైెరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అనంతరం మార్చి 16న ఢిల్లీలోని రెస్య్కూ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా..కోర్టు అనుమతితో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుంది.

Related News

Weather News: రాష్ట్రంలో కుండపోత వానలు.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం.. పిడుగులు పడే ఛాన్స్

Ramanthapur Incident: పెరుగుతున్న మృతుల సంఖ్య.. రామంతపూర్‌లో హై టెన్షన్..

CM Revanth Reddy: కులగణనను వక్రీకరిస్తే బీసీలకు న్యాయం జరగదు-సీఎం

RangaReddy District: రాష్ట్రమంతా వర్షాలు దంచికొడుతున్నా.. ఈ రెండు చెరువుల్లో చుక్క నీళ్లు లేని పరిస్థితి..

Heavy Rains: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం.. జనం అతలాకుతలం.. బయటకు వెళ్లోద్దు

Hyderabad News: హైదరాబాద్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి

Big Stories

×