BigTV English

Manu Bhaker: నా హీరో, నా డార్లింగ్ అతనే: మను బాకర్

Manu Bhaker: నా హీరో, నా డార్లింగ్ అతనే: మను బాకర్

Manu Bhaker about Thalapathy Vijay(Today’s sports news): అయ్యో.. ఏమిటి? ఒలింపిక్ స్టార్ మనుబాకర్ తన మనసులో మాట చెప్పేసిందా? కొంపదీసి నీరజ్ చోప్రా మేటర్ ఏమైనా లీక్ చేసిందా? అనే అనుమానాలతో నెట్టిల్లు ఒక్కసారి బ్లాస్ట్ అయ్యింది. అయితే అంత లేదండీ.. మేటర్ ఏమిటంటే.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన మనుభాకర్.. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైంది.


అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. ఆమెకు స్వయంగా స్వాగతం పలికి, స్టేజిపైక్ తీసుకువెళ్లారు.  ఈ సందర్భంగా మనుబాకర్ ను ఆయన ఒక ప్రశ్న అడిగారు. నేనెవరో తెలుసా? అని అన్నారు. అంతే ఒక్కసారి ఆ ప్రశ్న విని షాక్ అయ్యింది. ఏం చెప్పాలో తెలీక.. అడ్డంగా తెలీదన్నట్టు బుర్ర ఊపింది.  దాంతో స్టాలిన్ నవ్వేసి, నీకు పిస్టల్ షూటింగ్ తప్ప వేరే ధ్యాస లేదు..నిజమైన క్రీడాకారిణికి ఉండాల్సిన అసలైన లక్షణం ఇదేనని కొనియాడారు. చివరికి ఆయనే సీఎం అని తెలుసుకుని చాలా సిగ్గుపడింది.

స్టాలిన్.. మరొక ప్రశ్న అడిగారు. సరే, నీకు తమిళనాడులో ఎవరు బాగా తెలుసు? అంటే.. నాకు హీరో విజయ్ అంటే ఇష్టం.. నా ఫేవరెట్ హీరో మాత్రమే కాదు, తనే నా డార్లింగ్ అని కూడా చెప్పడంతో అక్కడ నవ్వులు పువ్వులై విరిశాయి. ఇదండీ సంగతి.. మను బాకర్ కి ఇష్టమైన సినిమా హీరో విజయ్ దళపతి అనే విషయం అందరికి అప్పుడే తెలిసింది.


Also Read: సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ ప్రకటించిన ఒలింపిక్ స్టార్

అంటే, ఇప్పుడు నీరజ్ చోప్రా కూడా విజయ్ స్టయిల్ లో సన్నగా, నాజుకుగా, డైలాగ్స్ కట్ టు కట్ పవర్ పుల్ గా చెబుతూ, చకచకా స్టెప్పులేసే తరహాలో రెడీ కావల్సి ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. నీరజ్ భయ్.. మను నీకు పెద్ద పరీక్షే పెట్టిందని కామెంట్లు చేస్తున్నారు. హీరో విజయ్ లా రెడీ అవ్వు అంటూ సలహాలిస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత షూటర్ మను భాకర్.. చెన్నై వేదికగా విజయ్ గురించి చెప్పడంతో…ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ కార్యక్రమంలో మను భాకర్‌ను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. అంతేకాదు ఆమెకు ప్రకటించిన క్యాష్ ప్రైజ్‌ను అందజేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్, మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్స్‌లో మను భాకర్ కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. అయితే మనుబాకర్ డార్లింగ్ విజయ్ నటిస్తున్న కొత్త సినిమా గోట్…సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు తెరకెక్కించారు.

Related News

India vs Pakistan Final: ఇండియాను వ‌ద‌ల‌కండి…చంపేయండి అంటూ రెచ్చిపోయిన పాక్ ఫ్యాన్‌..హరీస్ రవూఫ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి !

Asia Cup 2025 : పాక్ చెత్త ఫీల్డింగ్.. మ‌రోసారి రుజువైంది..చేతులారా వ‌చ్చిన రనౌట్ వ‌దిలేశారుగా

India vs Pakistan final: టీమిండియా, పాక్ మ‌ధ్య ఫైన‌ల్స్‌… 41 ఏళ్లలో తొలిసారి…రికార్డులు ఇవే..ఫ్రీగా చూడాలంటే?

IND vs SL: నేడు శ్రీలంక‌తో మ్యాచ్‌…టీమిండియాకు మంచి ప్రాక్టీస్…బ‌లాబ‌లాలు ఇవే

Rohith Sharma : మ‌రోసారి 10 కిలోలు తగ్గిన రోహిత్ శ‌ర్మ‌…ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే

Asia Cup 2025 : బంగ్లా చిత్తు… ఫైనల్ కు పాకిస్తాన్.. టీమిండియాతో బిగ్ ఫైట్

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

Big Stories

×