BigTV English

Fatal Social Media Love: ఇన్ స్టాగ్రామ్ లవర్ కోసం వేయికిలోమీటర్లు ప్రయాణించిన యువకుడు.. చివరికి రక్తపాతమే!

Fatal Social Media Love: ఇన్ స్టాగ్రామ్ లవర్ కోసం వేయికిలోమీటర్లు ప్రయాణించిన యువకుడు.. చివరికి రక్తపాతమే!

Fatal Social Media Love| సోషల్ మీడియా ద్వారా పరిచయమైన చాలామంది స్నేహితులు ఆ తరువాత ప్రేమికులుగా మారుతుంటారు. ఇలాంటి చాలా ప్రేమజంటలను చూస్తూనే ఉంటాం. కానీ తను ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు 1000 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లాడు. ఆ తరువాత ఏమయ్యాడో ఎవరికీ తెలియలేదు. చివరికి అతని తల్లిదండ్రులు కిడ్నాపింగ్ కేసు నమోదు చేయగా.. పోలీసులు గాలించడం మొదలెపెట్టారు. అయితే పోలీసులకు ఆ యువకుడి పోలికలతో ఉన్న శవం ముక్కలు దొరికాయి. దీంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేశాక భయంకరమైన నిజాలు తెలిశాయి.


పోలీసుల కథనం ప్రకారం.. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఛిందవాడా నగర సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల గజేంద్ర అనే యువకుడు సోషల్ మీడియా ద్వారా ఒక యువతిని కలిశాడు. వారిద్దరూ ప్రతిరోజూ చాటింగ్ చేసుకుంటూ క్రమంగా ప్రేమలో పడ్డారు. ఒకరోజు ఆ యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి గజేంద్ర ఆమె తల్లిదండ్రులతో మాట్లాడుతానని చెప్పాడు. ఆ యువతి పశ్చిమ బెంగాల్ కు చెందిన మిద్నాపూర్ జిల్లాలో నివసిస్తోంది. దీంతో గజేంద్ర ఇంట్లో తన స్నేహితులతో కలిసి కోల్ కతా వెళుతున్నానని చెప్పి ఒక కారు రెంట్ కు మాట్లాడుకొని బయలుదేరాడు.

గజేంద్ర నివసించే మధ్య ప్రదేశ్, ఛిందవాడా నగరం నుంచి అతని ప్రియురాలు ఉండే బెంగాల్, మిద్నాపూర్ జిల్లా 1122 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెంటల్ కారులో మిద్నాపూర్ వెళ్లిన గజేంద్ర వారం రోజులైనా ఇంటికి తిరిగిరాలేదు. అతని ఫోన్ స్విచాఫ్ వస్తోంది. దీంతో అతని తల్లిదండ్రులు అతని స్నేహితులతో మాట్లాడారు. అప్పుడు వారికి గజేంద్ర లవ్ స్టోరీ గురించి తెలిసింది. అయితే గజేంద్ర.. మిద్నాపూర్ వెళ్లాడని తెలుసుగానీ.. అక్కడ ఎవరి ఇంటికి వెళ్లాడో వారికి తెలియలేదు.


చివరికి గజేంద్ర తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కిడ్నాపింగ్ కేసు నమోదు చేశారు. గజేంద్ర కోసం గాలింపు మొదలుపెట్టిన పోలీసులు గజేంద్ర రోజూ ఫోన్ లో మాట్లాడే అమ్మాయి నెంబర్ ట్రేస్ చేసి.. మిద్నాపూర్ చేరుకున్నారు. అక్కడికి వెళ్తే.. ఆ అమ్మాయి ఎవరో పోలీసులకు తెలియలేదు. అక్కడ ఎవరిని అడిగినా తమకేమీ తెలియదన్నారు. పోలీసులకు అసలు గజేంద్ర ఏమయ్యాడో తెలీలేదు. చివరికి గజేంద్ర స్నేహితులలో ఒకడు చెప్పిన సమాచారంతో మళ్లీ మొదటినుంచి విచారణ మొదలు పెట్టారు.

Also Read: అమెరికాలో నీచ డాక్టర్.. మహిళలు, పిల్లలు నగ్నంగా ఉన్న సమయంలో ఏం చేసేవాడంటే?..

గజేంద్ర మిద్నాపూర్ వెళ్లడానికి రెంటల్ కారు ఆఫీస్ లో మాట్లాడినట్లు గజేంద్ర స్నేహితుడు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ కార్ రెంటల్ ఆఫీస్ కి వెళ్లి ఆరాతీశారు. అక్కడ పోలీసుల చేతికి ఆ కారు డ్రైవర్ చిక్కాడు. అతడినిక గట్టిగా ప్రశ్నిస్తే.. నిజమంతా చెప్పాడు. గజేంద్రను తీసుకొని ఆ కారు డ్రైవర్ మిద్నాపూర్ వెళ్లాడు. అయితే అక్కడ గజేంద్ర ప్రియురాలి కుటుంబ సభ్యులు అతడిని కత్తులతో పొడిచారు. వారి నుంచి తప్పించుకొని వచ్చిన గజేంద్ర ను తీసుకొని ఆ కారు డ్రైవర్ ఊరుదాటిన తరువాత చూస్తే.. గజేంద్ర అపస్మారక స్థితిలో ఉన్నాడు.

Also Read: ‘రైల్వే ఉద్యోగం కావాలా? రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది!’.. యువతిని మోసం చేసిన ‘అమిత్ షా సెక్రటరీ’

గజేంద్ర శరీరానికి ఉన్న గాయాలు చూసి అతను చనిపోయాడనుకున్నాడు ఆ డ్రైవర్. ఏం చేయాలో తెలియక.. పోలీసులకు చెబుదామంటే తనను కూడా గజేంద్ర ప్రియురాలి కుటుంబం చంపేస్తుందేమోనని భయపడి అలా చేయలేదు. చివరికి గజేంద్ర శవాన్ని ఊరు బయట చెట్ల వద్ద పడేసి వెళ్లిపోయాడు. ఇదంతా విన్న పోలీసులు.. ఆ డ్రైవర్ ని తీసుకొని గజేంద్ర శవం పడేసిన స్థలానికి చేరుకున్నారు. అక్కడ గజేంద్ర శవం ముక్కలు మాత్రమే ఉన్నాయి. గజేంద్ర వేసుకున్న బట్టలు, వాచీ చూసి అతని తల్లిదండ్రులు గుర్తుపట్టారు. అయితే గజేంద్ర బతికుండగానే డ్రైవర్ అతడిని చెట్ల వద్ద పడేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: ఏడాదిలో 9 మహిళలను చంపిన సైకో.. హత్యకు చిహ్నంగా లిప్ స్టిక్ తీసుకెళ్లే అలవాటు!

ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగింది. ప్రస్తుతం గజేంద్ర శవం డిఎన్‌ఏతో అతని తల్లిదండ్రుల డిఎన్ఏతో పోల్చి పరీక్షలు చేయిస్తున్నామని.. గజేంద్ర హంతకులను తప్పకుండా పట్టుకుంటామని చెప్పారు.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×