BigTV English

TRS Victory : టీఆర్ఎస్ ను తోకపార్టీలే గెలిపించాయా? లేదంటే కారు ఖల్లాసేనా?

TRS Victory : టీఆర్ఎస్ ను తోకపార్టీలే గెలిపించాయా? లేదంటే కారు ఖల్లాసేనా?

TRS Victory : మునుగోడులో 10,309 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ గెలిచింది. హోరాహోరీగా సాగిన ఎన్నికలో కారు పార్టీ టాప్ గేర్ లో దూసుకుపోయింది. మునుగోడు విజయం మామూలుది కాదంటున్నారు. ధన బలం, అంగ బలం భారీగా ఉన్న బలమైన లీడర్ రాజగోపాల్ రెడ్డిని ఓడించడం అంత ఈజీగా సాధ్యపడలేదు. కేసీఆర్ పక్కాగా ప్లానింగ్ తో మునుగోడులో మొనగాడిగా నిలిచారు. వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడమే కేసీఆర్ వ్యూహానికి నిదర్శనం అంటున్నారు.


ఒకప్పుడు తోకపార్టీలంటూ తిట్టిన సీపీఐ, సీపీఎం లే ఇప్పుడు మునుగోడులో గులాబీ బాస్ కు దిక్కయ్యాయి. నల్గొండ జిల్లా గతంలో కామ్రేడ్లకు కంచుకోట. కమ్యూనిస్టులది ఐదుసార్లు గెలిచిన చరిత్ర. ప్రస్తుతం అంతగా ఉనికి లేకపోయినా.. కరుడుగట్టిన ఓటు బ్యాంకు మాత్రం అలానే నిలిచి ఉంది. ఆ విషయం గుర్తించిన కేసీఆర్.. మునుగోడు బై పోల్ బెల్ మోగకముందే.. సుత్తి, కొడవలిలతో చేతులు కలిపేశారు. ఓ గుర్తింపు కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న వామపక్షాలు.. కేసీఆర్ పిలవగానే ఫోటోలకు ఫోజులిచ్చేశారు. ఇంకేం.. ఎర్ర జెండాల ఓట్లన్నీ గులాబీ పార్టీకే.

సుమారుగా 10 నుంచి 15 వేల ఓట్లను కామ్రేడ్లు ప్రభావితం చేయగలిగారని అంటారు. పలు గ్రామల్లో, కొన్ని వర్గాల్లో కమ్యూనిస్టులకు బలమైన ఓటర్లు ఉన్నారు. కామ్రెడ్లు బీజేపీకి బద్ద శత్రువులు కావడంతో ఎలాగైనా ఆ పార్టీని ఓడించాలనే సంకల్పంతో.. టీఆర్ఎస్ కోసం కమిటెడ్ గా పని చేశారని చెబుతున్నారు. రాష్ట్రస్థాయి వామపక్ష నాయకులు మునుగోడుకు తరలివచ్చి ప్రచారం చేయడం కూడా కలిసొచ్చిన అంశమే అంటున్నారు. అలా, గంపగుత్తగా సీపీఐ, సీపీఎం ఓట్లు కారుకే పడ్డాయని తెలుస్తోంది. మునుగోడు గెలుపు తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ముందు వామపక్షపార్టీలకు థ్యాంక్స్ చెప్పడం విశేషం.


టీఆర్ఎస్ కు 10వేల పైచిలుకు మెజార్టీ రావడం.. కమ్యూనిస్టులకు సుమారు 10 వేల ఓటు బ్యాంకు ఉండటం చూస్తుంటే.. గులాబీ పార్టీని గెలిపించింది తోకపార్టీలేనని అంటున్నారు.

Related News

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Congress: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

AP Politics: టీడీపీలో సంస్థాగత మార్పులపై రచ్చ!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టా… మరీ ఇంత మోసమా?

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

Big Stories

×