GST 2.0: జీఎస్టీ బొనాంజా రానే వచ్చింది. ఇకపై 5 శాతం, 18 శాతం రెండే శ్లాబులు. మిడిల్ క్లాస్ కు రిలీఫ్, ఫెస్టివల్ సీజన్ ధమాకా.. లోకల్ మార్కెట్స్ కు బూస్టప్.. అమెరికన్ టారిఫ్స్ కు చెక్ ఇవే టార్గెట్ గా సరికొత్తగా జీఎస్టీ మన ముందుకు వచ్చేసింది. సెప్టెంబర్ 22 విడుదల. దసరా నవరాత్రి ఉత్సవాలు, అలాగే దీపావళి ఫెస్టివ్ సీజన్ ఉంది. ఇక పండగే పండగా? జీఎస్టీ సంస్కరణలతో మొత్తం మారిపోతుందా?
ఫెస్టివల్ సీజన్‌కు ముందు జీఎస్టీ ధమాకా
రైట్.. భారత్ లో జీఎస్టీ సంస్కరణలతో ఫెస్టివల్ సీజన్ బూస్టప్ కాబోతోందా? అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఎక్కువగా మిడిల్ క్లాస్ కు రిలీఫ్ ఇచ్చేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంది. ఇంకొద్ది రోజుల్లో మనదేశంలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్ మొదలవుతుంది. దసరా నవరాత్రి ఉత్సవాలు, అలాగే దీపావళి పండగలు ఉన్నాయ్. ఈ టైంలో రిటైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, బట్టలు, ఆభరణాలు, స్వీట్స్, గృహోపకరణాలు, గిఫ్ట్ ఐటెమ్స్ వంటి రంగాల్లో భారీ కొనుగోళ్లు జరుగుతాయి. మార్కెట్లు కళకళలాడుతుంటాయ్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ లెక్కల ప్రకారం 2024లో దీపావళి సీజన్‌లో దేశవ్యాప్తంగా సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. నవరాత్రి సీజన్‌లో ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే దాదాపు 1-1.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా. 2025లో ఈ నెంబర్ దేశవ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జీఎస్టీ తగ్గించేశారు. ఈ పండుగల టైంలో ఆభరణాలు 30-40% వ్యాపారం, ఎలక్ట్రానిక్స్ 20-25%, ఆటోమొబైల్స్ 15-20%, దుస్తులు 20%, స్వీట్స్, గిఫ్ట్స్ లాంటివి బాగా అమ్ముడవుతాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలు దీపావళి సేల్స్‌లో దాదాపు 50 వేల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తాయి. సో ఈసారి జీఎస్టీ ధామాకాతో పండగ బిజినెస్ 4 లక్షల కోట్ల రూపాయలు దాటేస్తుందన్న లెక్కలున్నాయ్. అదే జరిగితే మన ఎకానమీకి కొత్త బూస్టప్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఇకపై 5%, 18 శాతం స్లాబ్ లే
జీఎస్టీ స్లాబ్‌లు ఇది వరకు 5%, 12%, 18%, 28 శాతంగా ఉండేవి. ఇప్పుడు వాటిని రెండుకు కుదించారు. అంటే 5%, 18% శాతం మాత్రమే ఉంచారు. మిడిల్ క్లాస్ ప్రజలు రోజువారీ వాడే చాలా వస్తువులపై జీరో జీఎస్టీ తీసుకొచ్చారు. 12%, 28% స్లాబ్‌లను తొలగించడం వల్ల చాలా వస్తువులు 5% లేదా 18 శాతం స్లాబ్‌లోకి వచ్చేశాయి. ఒక్కసారి ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. స్టేషనరీ వస్తువులు, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్సులపై జీరో, కిరాణా సామాన్, బైక్స్, 1200 సీసీ లోపు కార్లపై జీఎస్టీలు తగ్గించారు. వెన్న, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, మిల్క్, సాస్ లు, మాంసం, స్వీట్లు, జామ్, ఫ్రూట్ జెల్లీస్, కొకొనట్ వాటర్, నమ్ కీన్, వాటర్ బాటిల్స్, ఐస్ క్రీమ్, బిస్కెట్లు, కార్న్ ఫ్లేక్స్ సెరెల్స్ వంటి వాటిపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ ఉండగా, ఇకపై 5 శాతం రేట్ వర్తిస్తుంది. టీవీలు, ACలు, డిష్ వాషర్లు, వాషింగ్ మెషిన్లు 28% నుంచి 18 శాతానికి తగ్గాయి. టూత్ పౌడర్, ఫీడింగ్ బాటిల్స్, టేబుల్ వేర్, కిచెన్ వేర్, గొడుగులు, వంట పాత్రలు, సైకిళ్లు, వెదురు ఫర్నీచర్, దువ్వెనలు 12 శాతం నుంచి 5 శాతానికి షాంపూ, టాల్కం పౌడర్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్ లు, ఫేస్ పౌడర్, సోప్, హెయిర్ ఆయిల్ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గుతున్నాయ్. సిమెంట్ పై ట్యాక్స్ 28 శాతం నుంచి 18 శాతానికి కట్ డౌన్ చేశారు. దీంతో నిర్మాణ రంగానికి చాలా బూస్టప్ వస్తుందంటున్నారు. పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ వెహికల్స్ పై ట్యాక్స్ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గబోతోంది. 1,200 సీసీ కంటే ఎక్కువుండే పెట్రోల్ కార్లు, 1,500 సీసీ కంటే ఎక్కువుండే డీజిల్ కార్లకు 40 శాతం GST వర్తిస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కు ప్రస్తుతం ఉన్న 5 శాతం రేట్ కంటిన్యూ అవుతుంది. ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ ప్రకటించిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలకు ఆమోదం తెలిపామన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
జీఎస్టీ మార్పులతో కేంద్రంపై రూ.48 వేల కోట్ల ఎఫెక్ట్
రోజువారీగా వినియోగించే ఆహార, పానీయాలపై ట్యాక్స్ పూర్తిగా ఉండదని, చపాతీ, పరాటాకు ప్రస్తుతం 5 శాతం ట్యాక్స్ ఉండగా, ఇకపై ట్యాక్స్ ఉండదు. పాన్ మసాలా, సిగరెట్లు, కార్బొనేటెడ్ షుగర్ డ్రింక్స్ పై, హైఎండ్ కార్లపై మాత్రం 40 శాతం స్లాబ్ ఉండాలని డిసైడ్ చేశారు. సో ఇలా జీఎస్టీల్లో మార్పులతో దాదాపు 48 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందంటున్నారు. అయితే ఎకానమీ స్థిరంగా ఉంచడం, దేశీయంగా వినియోగం పెంచడం, అమెరికన్ టారిఫ్ ఎఫెక్ట్ ను తగ్గించడం వంటి వాటికి ఉపయోగపడుతుందంటున్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజల జీవితాలు మెరుగుపడతాయని, చిన్న వ్యాపారులు ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చని, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రజలపై భారం తగ్గించేందుకు జీఎస్టీలో సంస్కరణలు చేశామన్నారు ప్రధాని మోడీ. జీఎస్టీ కౌన్సిల్ ప్రారంభించాక పన్ను విధానంలో ఇదే అతిపెద్ద సవరణ. రైట్ జీఎస్టీ తగ్గించారు. మరి మనకేంటి? మన జేబులో ఎంత మిగులుతుంది? కారు కొంటే ఇది వరకు రేటుకు, ఇప్పటి రేటుకు ఎంత తేడా వస్తుంది? ఇది మిడిల్ క్లాస్ ఇంటి బడ్జెట్ పై తగ్గిన జీఎస్టీ ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుంది? జనానికి మిగిలిన డబ్బును మళ్లీ మార్కెట్లో పెడుతారని ప్రభుత్వం నమ్మి ఈ జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిందా?
మన ఇండి బడ్జెట్‌లో మిగిలేదెంత?
జీఎస్టీ తగ్గింది.. రెండు శ్లాబులకు కుదించారు. కొన్ని ప్రొడక్ట్స్ పై జీఎస్టీ మొత్తానికే ఎత్తేశారు. మరి ఈ మార్పులతో మన పర్స్ లో ఎంత వరకు మిగులుతుంది? ఎలా మిగులుతుందో వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఇంటి బడ్జెట్ లెక్కలు వేద్దాం. ముఖ్యంగా నెలవారీ కిరాణా సామాన్ అందరికీ అవసరమే. రోజువారీ వాడే హెయిర్ ఆయిల్ దగ్గర్నుంచి బిస్కెట్ల దాకా 5 శాతం జీఎస్టీ స్లాబ్ లోకి రావడంతో చాలా వరకు ఖర్చులు తగ్గినట్లే. ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ఉండే కుటుంబానికి నెలకు 5 వేల రూపాయలు అయ్యే కిరాణా బిల్లు ఇప్పుడు కొనే వస్తువుల ఆధారంగా ఇంచుమించు 500 నుంచి 800 రూపాయల వరకు తగ్గుతుంది. ఇందులో స్టేషనరీ ఖర్చులు కూడా వేసుకుంటే వాటిపై జీఎస్టీ జీరో చేశారు. ఫైనల్ గా ఇంకింత బడ్జెట్ తగ్గుతుంది. సో ఇంటి బడ్జెట్ ఎంతో కొంత తగ్గినట్లే కదా.
లైఫ్, హెల్త్ ఇన్సూరెన్సులపై జీరో జీఎస్టీ
నెక్ట్స్ లైఫ్, హెల్త్ ఇన్సూరెన్సుల సంగతి చూద్దాం. ఇందులో GST 18% నుండి సున్నాకి తగ్గించారు. అంటే కంప్లీట్ రిలీఫ్ అన్న మాట. ఉదాహరణకు భార్య, భర్త ఇద్దరు పిల్లలు ఉండే కుటుంబం ఏడాదికి 25 వేల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కు కడుతుందనుకుందాం. 18 శాతం జీఎస్టీ లేకపోవడంతో డైరెక్ట్ గా 4,500 రూపాయలు ఆదా అవుతాయి. సో నెక్ట్స్ ప్రీమియం 20,500 రూపాయలు కడితే సరిపోతుందన్న మాట. ఇప్పుడు చిన్న కార్ల సంగతి చూద్దాం. వీటిపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. డైరెక్ట్ గా 1200 సీసీ లోపు పెట్రోల్ కారు, లేదంటే 1500 సీసీ కెపాసిటీ డీజిల్ కారు కొంటే 18 శాతం జీఎస్టీ కారణంగా జనం 60 వేల రూపాయల నుంచి 80 వేల రూపాయల్ని ఆదా చేసుకోవచ్చు. సపోజ్ ఒక కారు 7.5 లక్షల ఎక్స్ షో రూమ్ ప్రైస్ ఉందనుకుందాం. 28 శాతం జీఎస్టీ అయితే 2.10 లక్షలు కట్టాల్సి వస్తుంది. అదే ఇప్పుడు 18 శాతం జీఎస్టీతో కట్టాల్సింది ఒక లక్షా 35 వేలు మాత్రమే. అంటే స్ట్రెయిట్ away మనకు 75 వేల రూపాయలు తగ్గిపోతుంది. చిన్న కుటుంబం, చిన్న కారు కొనే వారికి బిగ్ రిలీఫే కదా. ఈ దసరా, దీపావళికి కార్లు కొనే వారికి ఇంతకంటే ఏం కావాలి? ఈ 75 వేల రూపాయలను రకరకాల పొదుపు మార్గాల్లోకి మళ్లించుకోవచ్చు. FD వేసుకోవచ్చు, హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే తీసుకోవచ్చు. అవి కూడా జీరో అయ్యాయి. ఇందులోనూ డబ్బు మిగులుతుంది. చిన్న పిల్లలుంటే సుకన్య సమృద్ధి యోజన, లేదంటే PPF లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
పర్టిలైజర్స్ పై ప్రతి లక్షలో రూ.10 వేలు మిగిలే చాన్స్
ఇక రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇచ్చేలా సిమెంట్ జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఒక 60 ఇంచుల LED టీవీ 60 వేల రూపాయలు ఉందనుకుంటే.. ఇప్పుడు జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి తగ్గడంతో యావరేజ్ గా 6 వేల రూపాయలు తగ్గుతుంది. ఇక పండగ ఆఫర్లు ఉండనే ఉంటాయి. అవసరం లేని వారు కూడా పండగ సీజన్ లో ఇలాంటి వస్తువులు కొనే అవకాశం ఉంటుంది. సో మార్కెట్ బూస్టప్ అవుతుందన్న మాట. ఇక వ్యవసాయం విషయానికొస్తే ఫర్టిలైజర్ ఇన్ పుట్స్, ట్రాక్టర్స్ వాటి విడిభాగాలపై జీఎస్టీ 5 శాతానికి తగ్గించడంతో ఇవి రైతుల ఖర్చులను చాలా వరకు ఆదా చేస్తాయి. ఉదాహరణకు జీఎస్టీలో మెన్షన్ చేసిన అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కు 5 ఎకరాలకు లక్ష రూపాయలు ఖర్చయితే… వేసిన పంట, వాడిన ఫర్టిలైజర్ల మోతాదు ఆధారంగా యావరేజ్ గా ప్రతి లక్ష రూపాయల ఖర్చులో పదివేలు మిగిలే అవకాశం ఉంటుంది. అంటే రైతుకు చాలా రిలీఫే. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. ట్రాక్టర్స్ పై జీఎస్టీ 5 శాతానికి తగ్గించారు. యావరేజ్ గా ఓ ట్రాక్టర్ 6 లక్షల రూపాయలు ఉందనుకుంటే దానిపై ప్రస్తుత 5 శాతం జీఎస్టీతో 30 వేలు అవుతుంది. అంటే 6 లక్షల 30 వేలు. అదే అంతకు ముందు అయితే 6 లక్షల 72 వేలు. సో ఇప్పుడు తగ్గిన జీఎస్టీతో యావరేజ్ గా 42 వేల రూపాయలు రైతులకు ఆదా అయినట్లే. రైతుల ఖర్చులు తగ్గి లాభాలు పెరిగితే రూరల్ ఎకానమీ పెరుగుతుందన్న లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం వేసుకుంది.
చిన్న కార్లు, బైక్‌లు, టీవీలు, ACలు, రియల్ ఎస్టేట్ కు బూస్టప్ గా సిమెంట్ రేట్ తగ్గడం అన్నీ సెప్టెంబర్ 22 నుంచి చౌకగా మారుతాయి. పండుగ సీజన్ లో బడ్జెట్ షాపింగ్ ఇదే సరైన టైం. ఆఫర్లు ఇస్తాయా లేదంటే.. ఎలాగూ కస్టమర్లకు బెనిఫిట్ జరుగుతుంది కదా అని చెప్పి ఇండైరెక్ట్ గా బాదేస్తాయా అన్నది చూడాలి. సో ఈ జీఎస్టీ 2.0 ద్వారా మిడిల్ క్లాస్ పీపుల్ కి కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చింది. వారి ఇంటి బడ్జెట్ ను ఆదా చేస్తోంది. అదే సమయంలో లగ్జరీ లైఫ్ కోరుకునే వారు, అనారోగ్యం కలిగించే ప్రొడక్ట్స్ వాడుదామంటే మాత్రం భారీగా జేబులో నుంచి ఖర్చు చేయాల్సిందే. ఇది బ్యాలెన్స్ షీట్ మాత్రమే కాదు. మీ నెలవారీ ఇంటి బడ్జెట్ లెక్కలు. మీ పర్స్ లో యావరేజ్ గా ఎంత మిగులుతుందో లెక్కేసుకోండి.
Story By Vidya Sagar, Bigtv