BigTV English

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

AP Politics: విశాఖ కేంద్రంగా జనసేన మూడు రోజుల కార్యకర్తల సమన్వయ సమావేశం ముగిసింది. జనసేన పార్టీ అధికారంలో భాగస్వామి అయిన తర్వాత కార్యకర్తలకు సమయం కేటాయించకపోవడంతో అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలు నిర్వహించారు. మూడు రోజులు పవన్ విశాఖలోనే ఉండి అట్టహాసంగా సమావేశాలు నిర్వహించారు. ఏపీ తో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు హాజరయ్యారు. ఇంతకీ ఈ సమావేశాలతో జనసేనాని టార్గెట్ రీచ్ అయ్యారా? నాయకులకు కార్యకర్తలకు ఆయన చేసిన దిశాలిద్దేశం ఏంటి?


సేనాతో సేనాని పేరుతో విశాఖలో జనసేన 3 రోజుల సమావేశం

సేనాతో సేనాని పేరుతో మూడు రోజుల పాటు విశాఖలో నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తో పాటు సరిహద్దు రాష్ట్రాల నుండి కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ క్రియాశీలక కార్యకర్తలు నాయకులతో మూడు రోజుల పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణకు విశాఖను కేంద్రంగా ఎంచుకున్న జనసేనని పవన్ కళ్యాణ్ పార్టీ ప్రజా ప్రతినిధులకు పెద్ద టార్గెట్ ఇచ్చారు. మొత్తం 12,500 మంది జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో పాటు 500 మంది కీలకమైన నాయకులకు ఈ మీటింగ్లకు ఆహ్వానాలు పంపారు.


తెలంగాణ క్రియాశీలక కార్యకర్తలకు ఆహ్వానాలు..

ప్రత్యేకించి తెలంగాణ నుండి 250 మంది నాయకులు క్రియాశీల కార్యకర్తలకు ఆహ్వానాలు పంపి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పార్టీని బలోపితం చేయడానికి ప్లాన్ చేశారు. విశాఖ దక్షిణ నియోజక వర్గంలో నిర్వహించిన ఈ మూడు రోజుల సమావేశాల్లో ఎమ్మెల్యే వంశికృష్ణ శ్రీనివాస్ తో పాటు మంత్రి నాదెన్ల మనోహర్ ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ పంచకర్ల రమేష్ బాబు సుందరపు విజయకుమారులు సమన్వయం చేసి మూడు రోజుల సమావేశాలు విజయవంతంగా నడిపించగలిగారు. మొదటి రోజు ఈ సమావేశాల్లో జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లో కార్యకర్తల పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా ఉంటున్న ఎమ్మెల్యేల లోపాలు సైతం ఎత్తి చూపించారట. ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం మానేసి అనుచరులను అడ్డం పెట్టుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని జనసేనాని చేయించుకున్న సర్వేలో స్పష్టమైందట. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించి భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే వ్యక్తిగత మనుగడతో పాటు పార్టీ మనుగడ కూడా కష్టమవుతుందని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

ఎంపీలు, పార్టమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జిల సమావేశం

ఇక రెండో రోజు ఎంపీలు పార్లమెంట్ నియోజ వర్గాల ఇంచార్జీల సమావేశంతో పాటు కీలకమైన 150 మంది కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించారు. నియోజక వర్గాల్లో కూటమి నాయకులతో ఉన్న పరిస్థితులను కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 11 ఏళ్ల జనసేన పార్టీ ప్రయాణంలో 2024 ఎన్నికల్లో అధికారం చేపట్టిన తర్వాత పిఠాపురంలో జనసేనా పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించడం తప్ప ఎక్కడ కూడా కార్యకర్తలతో జనసేనాని నేరుగా సమావేశం నిర్వహించలేదు. విశాఖలో జరిగిన మూడు రోజుల సమన్వయ సమావేశంలో మొదటి రెండు రోజుల సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు పార్టీ ముఖ్యనేతలతో సమావేశంయ్యారు. ముచ్చటగా మూడో రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ నేరుగా 15000 మంది కార్యకర్తలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడతారనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఏపీ తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్రల నుంచి ఆహ్వానాలు లేకపోయినా పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో అనేకమంది కార్యకర్తలు విశాఖ చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సభా ప్రాంగణానికి కార్యకర్తలు చేరుకున్న సాయంత్రం 6:00 గంటలు దాటిన తర్వాత పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రావడంతో కొంత నిరుత్సాహం కార్యకర్తల్లో కనిపించింది.

అహ్వానాలు లేని వారిని అనుమతించని యంత్రాంగం

ఏపీ నుండి ఆహ్వానాలు అందుకున్న కార్యకర్తల కంటే ఎలాంటి ఆహ్వానాలు లేని కార్యకర్తలు అభిమానులు విశాఖ చేరుకున్న వాళ్ళను లోపలికి అనుమతించకపోవడం కొంత ఇబ్బందులకు గురిచేసింది. 15వ000 మంది క్రియాశీల కార్యకర్తలు వస్తారని భావించిన ఆ టార్గెట్ ని మాత్రం మూడో రోజు సమావేశం రీచ్ కాలేదు అనేది స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు జనసేన క్యాడర్ ను సమన్వయం చేస్తూ పవన్ కళ్యాణ్ సభా వేదిక నుండి నేరుగా కార్యకర్తలతో మాట్లాడతారని అందరూ భావించారు కానీ జనసేనని మాత్రం ఎంచుకున్న కొంతమంది కార్యకర్తలతో మాట్లాడించి తర్వాత పవన్ కళ్యాణ్ ప్రసంగించడం మొదలుపెట్టడంతో అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న కార్యకర్తల్లో నిరుత్సాహం మొదలైనట్టు కనిపించింది.

క్యాడర్‌కు దిశానిర్ధేశం చేయని జనసేన నేతలు

ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ 175 నియోజ వర్గాల్లో ఉన్న కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడంతో పాటు రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి భరోసాను నాయకులు ఇవ్వాలి అనే అంశం మీద మాట్లాడతారని అందరూ భావించారు. కానీ జనసేన అని పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతి సభలోనూ చెప్పినట్లే గత 11 సంవత్సరాల్లో జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ హాయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు తాను పడిన కష్టాన్ని మాత్రమే కార్యకర్తలకు చెప్పారు తప్ప ఎక్కడ కార్యకర్తలను పార్టీ ముఖ్య నాయకులను గ్రామ స్థాయి నుండి పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళను ఎలా వాడుకోవాలి కీలకమైన నాయకులు గుర్తించిన కార్యకర్తలను ఎలా ముందుకు నడపాలి అనేది మాత్రం ఎక్కడ వివరిస్తూ దిశా నిర్దేశం చేయలేదు. జనసేనాని క్రియాశీల కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసి కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారని భావించిన పార్టీ క్యాడర్ అంతా పవన్ ప్రసంగంతో డీలా పడినట్లు కనిపించింది. మరో 15 సంవత్సరాలు కూటమితో కలిసి ప్రయాణం చేయాలని ఎప్పటిలాగే కార్యకర్తలకు చెప్పడంతో గ్రామ స్థాయి నుండి నియోజ వర్గ స్థాయి వరకు కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు పైకి చెప్పుకోలేకపోయినా నిరుత్సాహంగా బయటకి వెళ్ళారు.

పదవులు దక్కని క్యాడర్‌ను సముదాయించే యత్రం చేయని పవన్

ఇప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళ కూటమిలో ఉన్న పార్టీలతో కలిసి వెళ్తామని పదే పదే చెప్తున్నారు. ఈ మీటింగ్ లో కూడా అదే చెప్పడంతో ఇప్పటికే నిరుత్సాహానికి గురైన కార్యకర్తలు పార్టీ నాయకులతో కలిసి కార్యకర్తల అభ్యున్నత కోసం ఏర్పాటు చేసిన ఈ మూడు రోజుల సమావేశం తర్వాత కూడా కూటమి ప్రస్తావన తప్ప జనసేన పార్టీ కార్యకర్తలను ప్రత్యక్షంగా గ్రామ స్థాయిలో పార్టీని బలోపితం చేయడానికి ఎలా వర్క్ చేయాలో నిర్దేశించకపోవడంతో పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం మాత్రం ఎవరికీ అర్థం కాకుండా బయటకి వెళ్ళిపోయారంట. ప్రతి సభలోనూ పవన్ కళ్యాణ్ మాట్లాడితే కేకలు కేరింతలు వేసే కార్యకర్తల సైతం సైలెంట్ గా ఉండిపోవాల్సిన పరిస్థితి సేనాతో సేనాని సభలో కనిపించింది. అధికారం చేపట్టి 14 నెలలు గడుస్తూన్న జనసేనా పార్టీ కార్యకర్తలకు సరైన అవకాశాలు లేకపోవడం నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ భాగస్వామ్యం రాకపోవడంతో ఇప్పటికీ గుర్రుగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించాల్సిన పవన్ కళ్యాణ్ తన మెహర్బానిని ప్రదర్శించడానికి ఈ సమావేశాలు నిర్వహించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సేన విస్తృతి స్థాయి సమావేశంలో కనిపించని టీడీపీ ముఖ్యులు

దీనికి తోడు పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు విశాఖలు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తే కూటమిలో ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న టీడిపి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు నారా లోకేష్ ఇంచార్జ్ మంత్రి రాంప్రసాదులు వేరే డేట్స్ ఖాళీ లేవన్నట్లు దానికి కనీసం ముఖం చూపించలేదు. అది కాక పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో నిర్వహించిన సదరు సమావేశంలో కార్యక్రమాలు నిర్వహించి వెళ్ళిపోయి కార్యకర్తలు అసహనానికి గురయ్యేలాగా వ్యవహరించారని జనసేన పార్టీ కీలక నాయకులు కార్యకర్తలు బాహటంగానే విమర్శిస్తున్నారు. ఉత్తరాంధ్రలో మూడు రోజులు పవన్ కళ్యాణ్ ఉండడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలను ముఖ్య నాయకులను సమావేశపరిచి జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తే కొంతవరకు టీడిపీకి ఇబ్బంది కలగవచ్చని భావన డిప్యూటీ సీఎం మంత్రులకు కలిగి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా కార్యకర్తలతో నేరుగా మాట్లాడతానని కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన జనసేన మూడు రోజుల సమావేశాలు కేవలం పవన్ కళ్యాణ్ కోసమే నిర్వహించారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Also Read: కత్తులు నూరుతూ.. భారత్ పై ట్రంప్ లాస్ట్ అస్త్రం ఇదేనా!

విశాఖలో జనసేనానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు కూడా కార్యక్రమాలు నిర్వహించడం జనసేన కార్యక్రమానికి కనీసం ముఖం చూపించకపోవడం జనసైనికుల్లో నిరుత్సాహానికి కారణమైందంట కార్యకర్తలతో కూడా కూటమిని మరో 15 సంవత్సరాలు తీసుకెళ్ళాలని పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఉత్సాహంగా విశాఖ చేరుకున్న ఏపీ సహా ఇతర రాష్ట్రాల జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు అసహనానికి కారణమైనంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు ఎలాంటి దిశా నిర్దేశం చేయకపోవడంతో తిరిగి తమ నియోజక వర్గాలకు జనసైనికులు పార్టీ కార్యక్రమాల్లో ఎలా ముందుకు వెళ్తారు అనేది వేచి చూడాలి.

Story By Ajay Kumar, Bigtv

 

Related News

Telangana BJP: సీక్రెట్‌గా షోకాజ్ నోటీసులు.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది?

Tadipatri Politics: తాడిపత్రి వైసీపీలో వార్.. పెద్దారెడ్డికి షాక్ తప్పదా?

Bigg Boss 9: అయ్యో మళ్లీ కాటేశాడే.. ఉత్కంఠతో పాటు నవ్వులు కురిపించిన శ్రీముఖి!

Congress: వర్ధన్నపేట ఎమ్మెల్యేకి కొత్త కష్టాలు..

Telangana Politics: పొన్నం టార్గెట్ రీచ్ అవుతాడా?

Big Stories

×