Bigg Boss Agnipariksha: బుల్లితెర పై ప్రసారం కాబోతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ 9 (Bigg Boss 9)తెలుగు కార్యక్రమం సెప్టెంబర్ 7 నుంచి ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఇకపోతే ఈ సీజన్లో భాగంగా కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా కామన్ మ్యాన్స్ కూడా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కామన్ మ్యాన్ క్యాటగిరి లో భాగంగా సెలెక్ట్ అయిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ అగ్ని పరీక్ష (Bigg Boss Agnipariksha) ద్వారా మరోసారి ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం అగ్నిపరీక్ష కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.
జడ్జిలుగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు…
ఇక ఈ కార్యక్రమానికి నవదీప్, బిందు మాధవి, అభిజీత్ జడ్జెస్ గా వ్యవహరించగా శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ అగ్నిపరీక్ష కార్యక్రమం చూసిన కొంతమంది ఇది రియల్ కాదని స్క్రిప్ట్ అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. స్క్రిప్ట్ ప్రకారమే జడ్జెస్ కూడా కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారనే ఒక వాదన వినపడుతుంది.. బిగ్ బాస్ అగ్నిపరీక్ష మొత్తం మోసమని, స్క్రిప్ట్ ప్రకారమే వారు ఎంపిక చేయాలనుకున్న వారిని మాత్రమే ఎంపిక చేస్తున్నారంటూ వాదన వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ జనీత్ (Janeeth)ఒక ఇంటర్వ్యూ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.
అగ్నిపరీక్ష స్క్రిప్ట్ కాదా?
జనీత్ 18 సంవత్సరాల వయసు కావడంతో తనకు భవిష్యత్తులో బిగ్ బాస్ ఛాన్స్ ఉంటుందనే కారణంతో తనని రిజెక్ట్ చేశారు అంటూ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఇలా తన అగ్నిపరీక్ష జర్నీ గురించి ఎన్నో విషయాలను తెలియ చేశారు. అయితే ఈ అగ్నిపరీక్ష కార్యక్రమం స్క్రిప్టా లేకపోతే రియలా అంటూ కూడా ప్రశ్న ఎదురైంది. తనకు తెలిసినంత వరకు ఇది స్క్రిప్ట్ కాదని రియల్ గానే జరుగుతుందంటూ జనీత్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. అయితే జడ్జెస్ జడ్జిమెంట్ కూడా స్క్రిప్ట్ కాదని ఈయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
సెప్టెంబర్ 7న ప్రారంభం…
జనీత్ 18 సంవత్సరాల వయసు అని అగ్నిపరీక్ష కార్యక్రమానికి వచ్చినప్పుడు తనని రిజెక్ట్ చేయడం సరైనది కాదని, ఇదే విషయాన్ని ముందే చెప్పి ఉంటే అసలు అప్లై చేసేవాళ్ళం కూడా కాదంటూ వారి అభిప్రాయాలను తెలిపారు.. అగ్ని పరీక్ష కార్యక్రమం ద్వారా పలువురు కంటెస్టెంట్ ఎంపిక చేశారని స్పష్టమవుతుంది. మరి ఎవరు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారనే విషయం తెలియాలి అంటే మరొక వారం రోజులపాటు వేచి చూడాల్సిందే. ఇక సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించి ఇదివరకే ఎన్నో రకాల వార్తలు వినిపించాయి . మరి కంటెంట్ గా సెలబ్రిటీలు ఎవరెవరు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు కామన్ మ్యాన్ క్యాటగిరీ కింద ఎవరు ఎంపిక అయ్యారనేది తెలియాల్సి ఉంది.
Also Read: Janhvi Kapoor: శ్రీదేవి హిట్ సినిమా రీమేక్ ఆలోచనలో జాన్వీ… వర్కౌట్ అయ్యేనా?