AP Politics: టీడీపీ రాష్ట్ర కమిటీ ఎలా ఉండబోతోంది.. ఎవరెవరికి ఈ సారి అవకాశాలు ఉంటాయి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు త్వరలో టీడీపీ స్టేట్ కమిటీ ఏర్పాటు జరుగుతుందని స్పష్టత ఇవ్వడంతో పార్టీ వర్గాల్లో చర్చ మొదలయింది.. ఆ దిశగా ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సమావేశాలు ముగిసాయి. అసలు తెలుగుదేశం పార్టీలో సంస్థాగత మార్పులు ఎలా ఉండబోతున్నాయి?
టీడీపీలో సంస్థాగత మార్పులపై చర్చ
తెలుగుదేశం పార్టీలో సంస్థాగత మార్పులు..క్రియాశీల పదవులు, మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి చర్చ జరుగుతోంది. ఈ నెలాఖరులోగా మరికొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.. దీంతో పాటు త్వరలో జిల్లా కమిటీలను పూర్తి చేసి ఆ తర్వాత రాష్ట్ర టీడీపీ కార్యవర్గం ఏర్పాటుపై దృష్టి పెట్టనుంది టీడీపీ అధిష్టానం.. ఆ క్రమంలో రాష్ట్ర టీడీపీ కమిటీకి సంబంధించి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లా కమిటీలు పూర్తి చేసి వెంటనే స్టేట్ కమిటీలపై దృష్టి పెట్టనున్నారు. యువత, మహిళలకు ఎక్కువగా అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.. యువతను బాగా ఎంకరేజ్ చెయ్యాలనే అలోచనలో పార్టీ అధిష్టానం ఉందంట. అందులో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోందంట.. ఎన్నికల సమయంలో పార్టీకి సేవలు అందించిన వారికి , టికెట్లు రానివారు.. అదే విధంగా మహిళలకు ఈసారి కమిటీల్లో ప్రాధాన్యత దక్కనుంది. కార్యకర్తలుగా కెరీర్ ప్రారంభించి పార్టీని అంటి పెట్టుకుని ఉన్న నేతలకు అవకాశాలు రానున్నాయి. సీఎం చంద్రబాబు కూడా ఇదే అంశాన్ని నేతలకు చెబుతున్నారు.
పార్టీతో పాటు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారి గురించి ఆరా
పార్టీ పదవులు తీసుకోడానికి ఎవరెవరు సుముఖత వ్యక్తం చేస్తున్నారు? ఎవరు నామినేటెడ్ పదవులు అడుగుతున్నారనే అంశంపై కూడా హైకమాండ్ స్పష్టత తీసుకుంటోంది. జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు జరిగిన తర్వాత రాష్ట్ర కమిటీపై దృష్టి పెట్టనున్నారు. కొంతమంది నామినేటెడ్ పదవులు కోరుకుంటున్నారు, పార్టీ పదవులు నిర్వహించేందుకు అంత సుముఖంగా లేరు. వీరిని కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆ దిశగా జిల్లాల వారీగా యువ నేతలు, మహిళా నేతల లిస్ట్ రెడీ అవుతోందంట.
Also Read: మోడీ, జిన్‌పింగ్, పుతిన్ దెబ్బ.. భారత్ పై ట్రంప్ యూ టర్న్?
పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవాలని సూచనలు
ఇదే విధంగా పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సీఎం పదే పదే చెబుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ పరంగా ముందుకు తీసుకు వెళ్లాలనే విధంగా నేతలకు సూచనలు ఇస్తున్నారు.. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనాలని నేతలకు చెబుతున్నారు. జిల్లా కమిటీ అయినా రాష్ట్ర కమిటీ అయినా ఇదే రకమైన సూచనలతో ఏర్పాటు జరగనుంది.. త్వరలోనే అన్ని కమిటీలు పూర్తి చెయ్యాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉందంట.
Story By Rami Reddy, Bigtv