BigTV English

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Meeting Fight: గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవికి మున్సిపల్ కార్పరేషన్ అధికారులకు కోఆర్డినేషన్ లేకుండాపోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ మహిళా ఎమ్మెల్యేకి మధ్య కోఆర్డినేషన్ ఇప్పటికే అనేక నిమిషాల్లో లేదనే విధంగా బయటికి బహిర్గతంగా వచ్చింది అయితే తాజాగా ఎమ్మెల్యే ఇచ్చిన లేఖని పట్టించుకోకుండా కమిషనర్ సొంతంగా ఓ నిర్ణయం తీసుకోవడంతో ఆ అంశం వివాదంగా మారిందట.. ఆ మున్సిపల్ కమిషనర్ తీరుని ఎమ్మెల్యే ఎండ గట్టరట.. అసలు ఏంటా లేఖ? ఎమ్మెల్యేకి అంత కోపమెందుకొచ్చింది?


హాట్‌హాట్‌గా గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాలు

గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాలు ఎంతో హాట్ హాట్‌గా సాగాయి.. కౌన్సిల్ సమావేశంలో అసలు మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారు.. అనేక మంది ప్రమాదాలకు గురవుతూ, చిన్నారుల అంశంలో ఇబ్బందిగా మారిన వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి మున్సిపాలిటీ అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇది గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి నిలదీశారు.. సాధారణంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలలో కొన్ని అంశాలను ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉంటారు.. ఆ అంశాలకు మున్సిపాలిటీ అధికారులు సమాధానం చెబుతూ ఉంటారు.. వాటి పరిష్కారానికి మేయర్ కూడా సూచనలు చేస్తూ ఉంటారు


అధికార పార్టీ ఎమ్మెల్యేల సూచనలను పాటించే అధికారులు

అధికార పార్టీ ఎమ్మెల్యేలు కౌన్సిల్ సమావేశాల్లో ఆగ్రహానికి గురి అయ్యే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి.. ఎందుకంటే అధికార పార్టీలో ఉంటారు కాబట్టి వారు చెప్పేటటువంటి అనేక అంశాలు మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ముందుకు తీసుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి.. కానీ గతంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి లేవనెత్తిన అంశాలపై కార్పొరేషన్ అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహించడంతో అధికారుల తీరుపై మంత్రి నారా లోకేష్ దృష్టికి ఎమ్మెల్యే గల్లా మాధవి తీసుకెళ్లారు. తనకు పూర్తిగా సహకారం అందించడం లేదని తాను చెప్పిన అంశాలను మున్సిపల్ అధికారులు కనీసం పరిగణించడం లేదంటూ ఆమె గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత ఈ అంశాలన్నిటినీ కేంద్రమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ దష్టిృకి వెళ్లడంతో అధికారులకు, ఎమ్మెల్యేలకు మధ్య కోఆర్డినేషన్ తీసుకువచ్చే ప్రయత్నం కూడా చేశారు.

అధికారులకు, ఎమ్మెల్యే గల్లా మాధవికి మధ్య మళ్లీ గ్యాప్

ఒక సమయంలో కార్పొరేషన్అధికారులకు, ఎమ్మెల్యే గల్లా మాధవికి మధ్య కోఆర్డినేషన్ కుదిరిన పరిస్థితి కనిపించింది.. అయితే శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించి పనుల నిర్లక్ష్యం అంశంలో పదేపదే ఎమ్మెల్యే చెప్పినా మునిసిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో అప్పట్లో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో మళ్లీ మున్సిపాలిటీ అధికారులకు ఎమ్మెల్యే గల్లా మాధవికి మధ్య మళ్లీ గ్యాప్ పెరిగినట్లు కనిపించింది. అధికారులు సహకరించడం లేదని గల్లా బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ప్రస్తుతం గుంటూరు నగరంలో వీధి కుక్కల సమస్యకు సంబంధించినటువంటి అంశంపై ఇప్పటికే అనేకసార్లు ఎమ్మెల్యే గల్లా మాధవి మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కమిషనర్‌కు పలు ఫిర్యాదులు చేశారు. వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించాలంటూ అసెంబ్లీ సాక్షిగా కూడా అనేకసార్లు గల్లా మాధవి ప్రస్తావించడం జరిగింది. అయితే సొంత నియోజకవర్గంలో ఈ అంశంపై మాత్రం ఆమెకు, మున్సిపల్ కమిషనర్‌కి మధ్య సమన్వయం కుదరలేదని మరోసారి బహిర్గతమైంది.

ఆపరేషన్లు సరిగ్గా నిర్వహించని ఎన్జీఓ సంస్థ

ఇదంతా ఈ అంశంలో అసలు విషయం వేరే ఉందంట. వీధి కుక్కల సమస్యకు సంబంధించి కొంతమంది ఎన్జీవోలు గల్లా మాధవి దృష్టికి తీసుకువెళ్లారంట. గతంలో గుంటూరు నగరంలో వీధికుక్కలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిన వారికి సరైనటువంటి పర్మిషన్లు లేవని, వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వందల కుక్కలు చనిపోయాయని ఆమె దృష్టికి తీసుకెళ్లారట. దానిపై గల్లా మాధవి అధికారులతో విచారణలు చేపట్టి గతంలో ఆపరేషన్లు నిర్వహించిన ఎన్జీవోలు సరైన పద్దతిలో నిర్వహించకపోవడం వల్లే వీధి కుక్కల సమస్య అనేది మరింత జటిలమైందంటూ ఆమె ఒక అంచనాకు వచ్చారంట. ఆ క్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి స్థానికంగా ఉన్నటువంటి నిపుణులైన ఎన్జీవో వారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిర్వహణకు పర్మిషన్ ఇవ్వాలని గుంటూరు నగర కమిషనర్ కి ఓ లేఖ రాశారట. ఆ లేఖలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫలానా సంస్థకు ఇవ్వడం వల్ల గుంటూరులో ఉన్నటువంటి వీధి కుక్కలకు ఎలాంటి సమస్య లేకుండా ఆపరేషన్లు కొనసాగుతాయని క్లియర్‌గా పేర్కొన్నారంట

పాత సంస్థనే సిఫార్సు చేసిన మున్సిపల్ కమిషనర్

అయితే ఎమ్మెల్యే చేసిన సూచనలను తప్పకుండా పాటిస్తామని చెప్పిన నగర కమిషనర్ ఎవ్వరికి తెలియకుండా గత ప్రభుత్వంలో పర్మిషన్లు పొంది రాష్ట్రవ్యాప్తంగా అనేక విధాలుగా విమర్శలు ఎదుర్కొంటున్న సంస్థనే సిఫార్సు చేశారంట. నగరంలో ఇప్పటివరకు జరిగిన ఆపరేషన్లకు సంబంధించి అనేక కేసులు ఎదుర్కొంటున్న ఒరిస్సా కి చెందిన పాత ఎన్జీవో సంస్థకే పర్మిషన్ ఇవ్వాలంటూ కేంద్ర యానిమల్ వెల్ఫేర్ బోర్డుకి లేఖ రాసినట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి దృష్టికి వచ్చిందంట. తాను చెప్పిన వారికి పర్మిషన్ ఇవ్వకపోగా, తనను కాదంటూ గతంలో తప్పిదాలు చేసిన వారికే పర్మిషన్ ఇవ్వాలని కమిషషనర్ లేక రాయడమేంటని ఎమ్మెల్యే మాధవి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారంట. తాను లబ్ది పొందే అంశం కాదు, ప్రజలకు లబ్ధి చేకూర్చే అంశపై తాను సూచనలు చేసినా, వాటిని పరిగణలోకి తీసుకోకుండా సొంత నిర్ణయంతో వెళ్లిన కమిషనర్ అంశాన్ని కౌన్సిల్ సమావేశాల్లో నేరుగా నిలదీయాలని నిర్ణయించుకున్నారంట. ఆ క్రమంలోనే ఎమ్మెల్యే గళ్లా మాధవి కౌన్సిల్ సమావేశంలో వీధి కుక్కల నియంత్రణ అంశంలో కమిషనర్‌పైన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారంట.

Also Read: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

ఏది ఏమైనప్పటికీ గుంటూరు నగరంలో మెజారిటీ పీపుల్ మనసు గెలుచుకున్న ఆ మహిళా ఎమ్మెల్యేని కమిషనర్ మాత్రం ముప్పు తిప్పలు పెడుతున్నట్లు ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తూ… అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్దమవుతోందంట.

Story By Rami Reddy, Bigtv

Related News

Congress: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

AP Politics: టీడీపీలో సంస్థాగత మార్పులపై రచ్చ!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టా… మరీ ఇంత మోసమా?

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

Telangana BJP: సీక్రెట్‌గా షోకాజ్ నోటీసులు.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది?

Big Stories

×