Concept for fruits and vegetables : వాషింగ్ మషీన్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బట్టలను శుభ్రం చేసేదే. కానీ కూరగాయాలు, పండ్లను శుభ్రం చేసే వాషింగ్ మషీన్లు కూడా ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. త్వరలో మనుషుల్ని స్నానం చేయించే వాషింగ్ మషీన్ కూడా వచ్చేస్తోంది.
మరి కూరగయాలు, పండ్లను శుభ్రం చేయడానికి వాషింగ్ మషీన్ అవసరమా? అనే సందేహం చాలామందికి వస్తుంది. నీళ్లలో కాస్త ఉప్పు వేసి కడిస్తే సరిపోతుందని భావిస్తారు. లేదంటే కాస్త పసుపు వేసినా అది యాంటీ బయోటిక్ గా పనిచేస్తుందనేవారు లేకపోలేదు. అయితే ఇవి అన్ని రకాల క్రిములు, పురుగు మందుల అవశేషాలను శుభ్రం చేయలేవంటారు సైంటిస్టులు. అందుకే కూరగాయలు, పండ్లను శుభ్రం చేయడానికి వాషింగ్ మషీన్లు వచ్చేస్తున్నాయి. కొత్తగా ఒయాసిస్ కూడా రాబోతోంది. దక్షిణ కొరియాకు చెందిన సియింఘో స్టూడియో కంపెనీకి చెందిన డిజైనర్లు ఒయాసిస్ పేరుతో దీన్ని రూపొందించారు.
పండ్లు, కూరగాయాలను ఈ వాషింగ్ మషీన్ లో వేసి ఆన్ చేస్తే చాలు… అందులో నుంచి ఆల్ట్రాసోనిక్ తరంగాలు
వెలువడుతాయి. పండ్లు, కూరగాయలపైన ఉండే ప్రమాదకర రసాయనాలను నిర్వీర్యం చేస్తాయి. అంతేకాదు వాటిపై ఉండే వ్యాక్స్, దుమ్మూధూళి, క్రిములను నాశనం చేస్తాయి. వాషింగ్ మషీన్ శుభ్రం చేసిన పండ్లు తినడానికి ఎంతో సురక్షితమైనవి. ఇక కూరగాయాలను నిర్భయంగా వండుకుని తినొచ్చు. ఈ మషీన్ త్వరలో అందులోబాటులోకి రానుంది.
పండ్లు, కూరగయాలను శుభ్రం చేసే వాషింగ్ మషీన్లు అందుబాటులో లేక కరోనా టైంలో జనం ఎంతగా ఇబ్బంది పడ్డారో తెలియంది కాదు కదా! మార్కెట్ కు వెళ్లి కూరగాయలు, పండ్లు తీసుకురావడం ఒకెత్తయితే… వాటిని శుభ్రం చేయడం మరో ఎత్తు. ఎక్కడ కరోనా వైరస్ అంటుకుంటుందోనని నీళ్లలో ఉప్పు లేదంటే మార్కెట్లో అందుబాటులో ఉన్న లిక్విడ్ లను వేసి శుభ్రం చేసిన రోజులు ఇంకా అందరి కళ్లముందు మెదులుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు పండ్ల తోటలు, కూరగాయాల తోటల్లో మొక్కలు ఏపుగా పెరగడానికి రసాయన ఎరువులు వాడుతుంటారు. పురుగులు మొక్కలను పాడుచేయకుండా పురుగు మందులను పిచికారి చేస్తుంటారు. వీటివల్ల దిగుబడి బాగా వచ్చినా… వాటి అవశేషాలు పండ్లు, కూరగాయలపై అలాగే ఉండిపోతాయి. వట్టి నీళ్లతో కడిగినా అవి పోవు. అందుకే వాషింగ్ మషీన్ వాటిని తొలగిస్తుందంటారు సైంటిస్టులు.