BigTV English

CPI Narayana: రేవంత్ రెడ్డి పులి మీద నుంచి దిగొద్దు.. దిగితే మింగేసే ప్రమాదముంది: నారాయణ

CPI Narayana: రేవంత్ రెడ్డి పులి మీద నుంచి దిగొద్దు.. దిగితే మింగేసే ప్రమాదముంది: నారాయణ

CPI Narayana Praises CR CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రాను తాను స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో చెరువులు, నాలాలు కబ్జా చేయడం వల్ల వర్షపు నీరు ఎటు వెళ్లాలో అర్థం కావడంలేదన్నారు. ఈ కారణంగానే వర్షం ఎప్పుడు కురిసినా.. అది కూడా కొద్దిపాటి వర్షానికే నగరం ముంపునకు గురయ్యే పరిస్థితి ఎదురవుతుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చుతున్నారన్నారు. అయితే, వారికి ప్రభుత్వం ప్రత్యామ్యాయం చూపాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి పులి మీద నుంచి కిందకు దిగొద్దు.. దిగితే మింగేసే ప్రమాదం లేకపోలేదు. చెరువుల్లో నిర్మించినటువంటి గవర్నమెంట్ ఆఫీసులు ప్రజలకు సేవ చేస్తున్నాయి. ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులు యథేశ్చగా కబ్జా చేసి కార్యాలయాలు నడుపుతున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి’ అంటూ ఆయన పేర్కొన్నారు.


Also Read: షాద్‌నగర్‌కు హైడ్రా.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు

అదేవిధంగా బీజేపీ యేతర రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదన్నారు. దేశంలో ఫెడరల్ స్ఫర్తిని దెబ్బతీస్తున్నారన్నారు. అదానీకి సెబీ దాసోహమైందన్నారు. దీనిపై కూడా జేపీసీ వేయాలంటూ నారాయణ డిమాండ్ చేశారు.


Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×