BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్’ 8 ట్విస్ట్.. ఏంటీ, ఈ కంటెస్టెంట్స్ హ్యాండిచ్చారా? మరి వెళ్తోంది ఎవరు?

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్’ 8 ట్విస్ట్.. ఏంటీ, ఈ కంటెస్టెంట్స్ హ్యాండిచ్చారా? మరి వెళ్తోంది ఎవరు?

Bigg Boss 8 contestants list: ప్రముఖ తెలుగు టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’కు ఎంతటి ప్రేక్షకాదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ వంటి భాషల్లో కూడా ఈ షోకు సూపర్ డూపర్ క్రేజ్ ఉంది. అందులో ఎక్కువగా తెలుగు ప్రేక్షకులు బిగ్‌బాస్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ముందుగా బిగ్ బాస్ సీజన్ 1 షోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించి అదరగొట్టేశాడు. ఫస్ట్‌ సీజన్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది.


ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 2 వచ్చింది. దీనికి నేచురల్ స్టార్ నాని సెకండ్ సీజన్‌కి హోస్ట్‌గా చేశాడు. ఈ సీజన్ కూడా మరింత స్పందనతో దూసుకుపోయింది. సెలబ్రిటీలు రీల్‌లో కాకుండా రియల్‌గా ఎలా ఉంటారు అనేది చూడొచ్చు. వారి ప్రేమ, కోపం, త్యాగం, హెల్పింగ్, దుఃఖం, ఆప్యాయత, స్నేహం ఇవన్నీ ఇందులో రియాలిటీగా చూడొచ్చు. అందువల్లనే ఈ రియాలిటీ షో బాగా పాపులర్ అయింది. ఇక మూడో సీజన్ నుంచి నాగార్జున హూస్ట్‌గా వ్యవహరించాడు.

అప్పటి నుంచి ఈ రియాలిటీ షోను తన భుజాలపై వేసుకుని నడిపిస్తున్నాడు. వరుసగా ఏడు సీజన్లు అలవోకగా నడిపించాడు. ఎక్కడా ప్రేక్షకాదరణ పోకుండా చాలా ఆసక్తికరంగా ఈ షోను ఏడు సీజన్ల వరకు నడిపించాడు. అయితే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ఎనిమిదో సీజన్ మొదలవబోతుంది. దీనికోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ షో గ్రాండ్ లాంచ్‌కి ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉన్నాయి. మంచి అంచనాల మధ్య సరికొత్త సీజన్ 8 సెప్టెంబర్ 1న ప్రారంభం కానుంది.


Also Read: ‘బిగ్ బాస్ సీజన్ 8’ డేట్ ఫిక్స్.. అన్‌లిమిటెడ్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌!

కానీ ఈ రియాలిటీ షోలో పాల్గొనబోతున్న కంటెస్టెంట్స్‌ పేర్లు ఇంకా తెలియకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ రియాలిటీ షోలో షానూర్ సనా, బామ్‌చిక్ బబ్లూ, రీతు చౌదరి, విష్ణుప్రియ భీమినేని, అనిల్ గీలా, యాదమ్మ రాజు, బర్రెలక్క, ఇంద్రానియేల్, ఖయ్యూమ్, అభయ్ బేతిగంటి, తేజస్విని గౌడ, ఇంద్రనీల్, కమెడియన్ బబ్లూ, అంజలి పవన్, పవిత్ర వంటి సెలబ్రిటీలు సెలెక్ట్ అయినట్లు ఓ లిస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

తాజా సమాచారం ప్రకారం స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలు మొగలి రేకులు నటుడు ఇంద్రానియేల్, జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు బిగ్ బాస్ తెలుగు 8 లో పాల్గొనే అవకాశాన్ని మార్చుకున్నారు అని తెలుస్తోంది. మరోవైపు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి సోషల్ మీడియా సెలబ్రిటీ అయిన బర్రెలక్క కూడా సీజన్ 8 నుంచి తప్పుకున్నట్లు సమాచారం. కానీ బర్రెలక్క షోకి ఎంపికైనట్లు మాట్లాడుతున్న వీడియో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోపై చాలా మంది ఆమెకు మద్దతు కూడా ప్రకటించారు. అయితే వీరితో పాటు ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ తమ్ముడు ఖయ్యూమ్‌ కూడా బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్‌గా పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఖయ్యుమ్ తాజాగా స్పందించారు. తాను బిగ్ బాస్8లో భాగం కాలేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ వార్తలకు చెక్ పెట్టినట్లయింది.

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×