BigTV English

CPI Narayana : అమెరికాలో సీపీఐ నారాయణ బంధీ!.. ఫోటో తెచ్చిన ప్రాబ్లమ్

CPI Narayana : అమెరికాలో సీపీఐ నారాయణ బంధీ!.. ఫోటో తెచ్చిన ప్రాబ్లమ్

CPI Narayana : సీపీఐ నారాయణ. ఫైర్ బ్రాండ్ కామ్రేడ్. పెద్ద నోరున్న నేత. అందరినీ విమర్శిస్తుంటారు.. అందరితోనూ సన్నిహితంగా ఉంటారు. కాంట్రవర్సీ కామెంట్లు చేయడంలో దిట్ట. ఆఖరికి బిగ్ బాస్ షోను కూడా వదలలేదు. అలాంటి నారాయణకు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. దాదాపు మూడు రోజుల పాటు ఆయన్ను విమానాశ్రయంలోనే కట్టడి చేశారు అక్కడి అధికారులు. ఇంతకీ అమెరికాలో ఏం జరిగింది? నారాయణను ఇమిగ్రేషన్ సిబ్బంది ఎందుకు అదుపు చేశారు? ఆ వివరాలు ఆసక్తిగా ఉన్నాయి.


నారాయణ ఫోన్ లోని ఓ ఫోటోనే ఆయనకు ఇంతటి కష్టాలు తెచ్చిపెట్టింది. ఆ ఫోటో మామూలుది కాదు మరి. క్యూబా అధ్యక్సుడు మిగ్యుల్ డియాజ్ కానెల్తో దిగిన ఫోటో అది. ఇక అంతే. ఆ ఫోటో చూసి ఫ్లోరిడా విమానాశ్రయ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అమెరికాకు శత్రు దేశమైన క్యూబా ప్రెసిడెంట్ తో ఫోటో దిగడంతో నారాయణను శంకించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయన్ను ఎయిర్ పోర్టులోనే ఆపేశారు. అలా గంటో, ఓ పూటనో కాదు.. ఏకంగా 69 గంటల పాటు సీపీఐ నారాయణ విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది.

క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలకు హాజరవడానికి వెళ్లారు సీపీఐ నారాయణ. ఆ మీటింగ్స్ లో పాల్గొని.. పనిలో పనిగా క్యూబా అధ్యక్షునితో ఓ ఫోటో దిగారు. ఆ తర్వాత క్యూబా రాజధాని హవానా నుంచి అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ తనిఖీల్లో భాగంగా నారాయణ సెల్ ఫోన్ లో ఉన్న ఫోటో చూసి అక్కడి సిబ్బంది ఆయన్ను అక్కడే ఆపేశారు. పలుమార్లు ప్రశ్నించి.. ఆయన చెప్పిన వివరాలు కన్ఫామ్ చేసుకొని.. పై అధికారులతో మాట్లాడి.. చివరకు సుమారు మూడు రోజుల తర్వాత వదిలేశారు. అలా సీపీఐ నారాయణకు విమానాశ్రమం నుంచి విముక్తి లభించింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వీడియో సందేశంతో మీడియాకు వెల్లడించారు.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×