BigTV English

IAS Smitha Tweet Controversy : స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై దుమారం.. ట్వీట్ ను సమర్థించుకున్న అధికారిణి

IAS Smitha Tweet Controversy : స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై దుమారం.. ట్వీట్ ను సమర్థించుకున్న అధికారిణి

IAS Smitha Tweet Controversy : ఐఏఎస్ సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై స్మితా సభర్వాల్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారాన్ని రేపింది. దివ్యాంగులను అవమానించేలా ట్వీట్ చేశారామె. ఒక విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్ గా నియమిస్తుందా ? వైకల్యం ఉన్న సర్జన్ తో వైద్యం చేయించుకుంటారా ? అలాంటపుడు ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓస్ లు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవి. అలాంటి వాటిలో పనిచేసేవారికి శారీరక దృఢత్వం ఉండాలి. కానీ.. ఇలాంటి అత్యున్నత సర్వీసులో దివ్యాంగుల కోటా అవసరం ఏంటి ? అని ఆమె ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫైరయ్యారు.


తాజాగా ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాల లత స్మితా సభర్వాల్ పోస్టుపై అసహనం వ్యక్తం చేశారు. దివ్యాంగులను కించపరిచేలా పోస్టు చేయడంపై ఆమె వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తొలి ఉద్యోగాన్ని దివ్యాంగురాలికే ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. స్మితా రిజైన్ చేసి వస్తే.. ఇద్దరం మళ్లీ పరీక్ష రాద్దామని, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులొస్తాయో చూద్దామని సవాల్ చేశారు.

Also Read : కేసీఆర్ తనకు తానే ఆర్కిటెక్ట్ అనుకుని కట్టిన ప్రాజెక్ట్ ఇదీ.. అందుకే ఇంత నష్టం


స్మిత ఫిజికల్లీ ఫిట్ గా ఉండొచ్చేమో కానీ.. మెంటల్లీ అన్ ఫిట్ అన్నారు. స్మిత 24 గంటల్లో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే జైపాల్ రెడ్డి స్మృతివనం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడుతానన్నారు. ఆమెపై సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి చర్యలు తీసుకోవాలని బాలలత డిమాండ్ చేశారు.

అయితే స్మిత సభర్వాల్ తాను చేసిన ట్వీట్ ను సమర్థించుకున్నారు. ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ లతో పాటు మరికొన్ని రక్షణ రంగాల్లో దివ్యాంగులకు కోటా ఎందుకు ఇవ్వలేదో కూడా ప్రశ్నించండి అంటూ ట్వీట్ చేశారు. సమ్మిళితమైన సమాజంలో జీవించడం అన్నది అందరి కల అన్నారు.

Tags

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×