E-Paper
Advertisement

లేట్ చేస్తే ఫైన్లే.. కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న సైబరాబాద్ కమిషనర్!

లేట్ చేస్తే ఫైన్లే.. కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న సైబరాబాద్ కమిషనర్!
Advertisement

Urban Development: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ది పనులపై మున్సిపల్ కమిషనర్ జి. శ్రీజన ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో పరిపాలనపరంగా, పౌర సేవల నిర్వహణ పరంగా వినూత్న తరహాలో ముందుకెళ్తున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అన్ని విభాగాల వారీగా అభివృద్ది పనులను వేగవంతం చేసేందుకు కమిషనర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ప్రతి రోజు ఏదో ఓ కార్యక్రమం

Advertisement

కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో జీహెచ్ఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్ల తరహాలో కాకుండా ప్రజావాణి కార్యక్రమాన్ని కాస్త జవాబుదారితనం ఉండేలా, ప్రజల ఫిర్యాదులను పారదర్శకంగా పరిష్కరించే దిశగా ప్రతి ఆర్జీకి ఓ ట్రాకింగ్ ఐడీని కేటాయించి, మరీ పరిశీలించి, పరిష్కరిస్తున్న సంగతి తెల్సిందే. అంతేగాక, ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ప్రజాపాలన, అభివృద్ది ప్రణాళికలో భాగంగా రూపొందించిన 99 రోజుల కార్యాచరణలో భాగంగా క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లు ప్రతి రోజు ఏదో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.

అధికారులకు స్పష్టమైన ఆదేశాలు

Advertisement

నేరుగా ప్రజల్లోకి వెళ్లగా, సైబరాబాద్ కమిషనర్ శ్రీజన మాత్రం ఎంతో వెరైటీకి ప్రతి రోజు ఒక వార్డు అన్న నినాదంతో రోజుకో మున్సిపల్ వార్డును సందర్శించిన అక్కడి సమస్యలను నేరుగా తెల్సుకోవటంతో పాటు ఆ సమస్యలను స్థానికులు సంతృప్తి చెందేలా ఎలా పరిష్కరించాలన్న అంశంపై స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల అభిప్రాయాలను స్వీకరించి, వాటిని పరిగణలోకి తీసుకుని స్థానికంగా అభివృద్ది పనులు చేపట్టాలని కూడా కమిషనర్ వివిధ విభాగాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలో కొత్తగా ఏర్పాటవుతున్న భవనాలు, నివాసాలకు అవసరమైన స్థాయిలో రోడ్లు వేయటం, వీధి ధీపాలు సమకూర్చటంతో పాటు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు వీలుగా ప్రత్యామ్నాయ చర్యలను కూడా త్వరలోనే కమిషనర్ తెరపైకి తీసుకురానున్నట్లు తెలిసింది.

Also Read: కమిషనర్ రంగనాథ్‌పై కోర్టు సీరియస్.. హైడ్రాకు ఆ అధికారం ఎవరిచ్చారు?

ఆ రెండు విభాగాలపైనే ప్రధాన దృష్టి

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు పేరుకు తగిన విధంగా పౌర సేవల నిర్వహణను మెరుగుపర్చటంతో పాటు మౌళిక వసతుల కల్పన కూడా ఆధునిక విధానంలో జరగాలన్నది కమిషనర్ జి. శ్రీజన వ్యూహాంగా కన్పిస్తుంది. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ ఆస్తుల్లో భాగంగా భవనాలు, స్పోర్ట్స్ స్టేడియంలు, మున్సిపల్ మార్కెట్లతో పాటు ఖాళీ ప్రదేశాలను గుర్తించి, వాటిని ఆధునిక విధానంలో ఆకర్షనీయమైన పార్కులుగా తీర్చిదిద్దాలని కమిషనర్ వ్యూహాం కన్పిస్తుంది. ముఖ్యంగా సీఎంసీ ఆస్తుల్లో భాగంగా ఎస్టేట్ విభాగంలో ఎన్నిమార్కెట్లున్నాయి? వాటిలో ఎన్న స్టాళ్లు, ఎన్ని మలిగీలు అద్దెకు కేటాయించారు? వాటి నుంచి వస్తున్న అద్దెలు ఎంత? ఇంకా ఎన్ని స్టాళ్లు, మలిగీలు ఖాళీ ఉన్నాయన్న సమాచారాన్ని తనకు సమర్పించాలని ఇప్పటికే కమిషనర్ ఎస్టేట్ విభాగం అధికారిని ఆదేశించినట్లు తెలిసింది. ఖాళీ స్థలాలను అలాగే వదిలేయకుండా పార్కులుగా తీర్చిదిద్ది స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా తీర్చిదిద్దాలని కమిషనర్ భావిస్తున్నట్లు తెలిసింది.

గడువు పెంచే ప్రసక్తే లేదు

సైబరాబాద్ పరిధిలోని ఖాజాగూడ, ఆల్విన్ క్రాస్ రోడ్డు, మియాపూర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న హెచ్ సిటీ పనులను ముందుగా నిర్ణయించిన గడువు లోనే పూర్తి చేయాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఇప్పటికే పలు సార్లు తేల్చి చెప్పారు. ఈ పనులను కాంట్రాక్టర్లు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయకుండా అదనంగా గడువు పెంచాలని అడిగితే, ఎన్ని రోజులు పెంచాల్సి వస్తే, అన్ని రోజులు కాంట్రాక్టు సంస్థ రూజువారి జరిమానాలను చెల్లించాలన్న ప్రతిపాదనను తీసుకురానున్నట్లు సమాచారం.

తుది దశలో కొత్త వాహానాల ప్రతిపాదన

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉన్నతాధికారులు, అధికారులకు ఎలక్ట్రిక్ వాహానాలను కొనుగోలు చేయాలని ఇటీవలే స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రతిపాదనకు సంబంధించి ఇప్పటికే మూడు పేరుగాంచిన కార్ల కంపెనీలు కార్పొరేషన్ ను సంప్రదించి, ఎస్టిమేట్లను సమర్పించటంతో పాటు వారి వాహానాల ప్రాముఖ్యత, పని తీరు వంటి అంశాలపై కమిషనర్ శ్రీజనకు వివరించినట్లు, మూడు పేరుగాంచిన కంపెన్లీలో త్వరలోనే ఒక కంపెనినీ ఎంపిక చేసి వాహానాల కొనుగోలు బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలిసింది.

Also Read: ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్దం.. విపక్షాలకు మంత్రి అడ్లూరి ఓపెన్ ఛాలెంజ్!

Related News

కేసీఆర్‌కు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్దమా అంటూ ఫైర్!

బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీపై పోక్సో కేసు నమోదు

ఒక్కడివే నామినేషన్ ఫిల్ చెయ్ చూద్దాం.. సీఎం రేవంత్‌కి బిజెపి ఎంపీ ఓపెన్ ఛాలెంజ్!

ఎల్లంపేట్‌‌ మున్సిపల్ ఆఫీసులో ఇదేం విచిత్రం.. భార్యది అధికారం అయితే భర్తది పెత్తనమా..!

అమెరికాలో భట్టి విక్రమార్క హవా.. డల్లాస్‌లో గ్రాండ్ వెల్‌కమ్!

సీఎంఆర్ అక్రమాలపై ఉత్తమ్ ఫోకస్.. 12 ఏళ్ల లెక్కల తేల్చేందుకు సమీక్ష!

నాగర్‌కర్నూల్‌లో నకిలీ ఎరువుల కలకలం.. 872 సంచులు స్వాధీనం, 7 గురు అరెస్ట్!

ఫరీదాబాద్‌లో ఘోరం.. లేడీ టీచర్‌ను 30 సెకన్లలో 25 సార్లు పొడిచి చంపేశాడు!

Big Stories

Advertisement
×