E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: వెంకీకి షాక్ ఇచ్చిన నందు   

Brahmamudi Serial Today Episode August 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: వెంకీకి షాక్ ఇచ్చిన నందు   
Advertisement

Brahmamudi serial today Episode: కిచెన్‌లోకి వెళ్లి ఇందుకు సారీ చెబితే ఇందు కూడా కోపగించుకున్నట్టు రాజు మీదకు పిండి విసిరి బయటకు వెళ్తుంది. వెనకాలే వెళ్లిన రాజు, ఇందును కూల్‌ చేసేందుకు సాంగ్‌ పాడతాడు. రాజు ఎంత ట్రై చేసినా ఇందు కూల్‌ కాదు. రాజు భోజనం చేయడానికి వెళ్లి డైనింగ్‌ టేబుల్‌ మీద పచ్చి కూరగాయలు ఉండటం చూసి షాక్‌ అవుతాడు. ఏయ్‌ ఏంటే ఇది వంట చేయలేదా..? అని అడగ్గానే.. చేయలేదని ఇందు చెప్తుంది. వంట చేయకపోతే తినాలి కదా..? ఇప్పుడు ఎలా అని రాజు అడగ్గానే.. ఎవరు తినాలి అని ఇందు అడిగితే నువ్వు తినాలి.. నేను తినాలి.. ఇంట్లో వాళ్లు తినాలి అంటూ రాజు చెప్పగానే.. నా తిండి సంగతి నీకెందుకులే కానీ నీకు మాత్రం నేను వంట చేయను అంటుంది.

మొగుణ్ని పస్తులు ఉంచితే పాపం వస్తుందే అంటాడు రాజు. నువ్వు అద్దె మొగుడివేలే అంటుంది ఇందు. అద్దె మొగుడిని పస్తులు ఉంచినా పాపం వస్తుంది అంటాడు రాజు. అయినా సరే నేను చేయను అంత ఆకలిగా ఉంటే నువ్వు వంట చేసుకో అంటుంది ఇందు. రాజు షాక్‌ అవుతాడు. తర్వాత ఈ రాజు గాడు అంటే ఏంటో చూపిస్తాను.. నా వంట నేను చేసుకుంటాను అంటూ కోపంగా రాజు కిచెన్‌లోకి వెళ్లి వంట చేస్తుంటాడు. అపర్ణ వచ్చి నేను వెళ్తానే పాపం ఎంత ఇబ్బంది పడుతున్నాడో అంటుంది. అందుకు ఇందు ఒప్పుకోదు.. అపర్ణను ఆపేస్తుంది. మీ మనవడిని మన దారిలోకి తెచ్చుకోవాలంటే ఈ మాత్రం చేయాలి నువ్వు ఊరుకో నీకేం తెలియదు అంటుంది. కిచెన్‌లో తనకు వచ్చినట్టు వంటలు చేస్తుంటాడు రాజు. చేయి కాలుతుంది. అది చూసి తట్టుకోలేని అపర్ణ పరుగెత్తుకుంటూ కిచెన్‌లోకి వెళ్లి రాజు చేతికి వెన్నపూస రాస్తుంది. నేను నీకోసం బిర్యాని చేశాను. వెళ్లి తిను అంటుంది అపర్ణ.

Advertisement

రాజు నవ్వుతూ బిరియానీయా..? అంటూ రాజు డైనింగ ‌టేబుల్‌ దగ్గరకు వెళ్తాడు. అపర్ణ బిరియానీ తీసుకొచ్చి రాజుకు వడ్డిస్తుంది. స్మెల్‌ గుమగుమలాడేస్తుంది.. తినకుండానే కడుపు నిండేలా ఉంది ఏయ్‌ ఇందు నువ్వు నాకు వండను అన్నావు కదా..? మా అమ్మమ్మ ఉంది చూడు నాకు వండిపెట్టడానికి అంటాడు. ఏంటి మా నాన్నమ్మకు నామీదే కంప్లైంట్‌ ఇస్తున్నావా..? అంటూ ఇందు అడగ్గానే.. మీ నాన్నమ్మ కాదు మా అమ్మమ్మ అయినా నన్ను  బిర్యాని తినకుండా ఆపేస్తున్నావేంటి అంటూ రాజు బిరియాని తింటాడు. మళ్లీ చెప్తున్నాను అమ్మమ్మ బిరియాని సూపర్‌గా చేశావు అంటూ వెళ్లిపోతాడు. ఇందు మాత్రం నాన్నమ్మ మీ మనవడు మీరేం చెప్తే అది చేస్తాడట.. మరి రేపటి నుంచి మనం ఏం అనుకున్నామో అది మొదలుపెడదామా..? అని అడగ్గానే.. అపర్ణ సరే అంటుంది.

బెడ్‌రూంలో ఉన్న ఇందు దగ్గరకు వెళ్లిన ఐశ్వర్య తనకు రెండు లక్షలు కావాలని అడుగుతుంది. ఎందుకని ఇందు అడగ్గానే.. ముందు డబ్బు ఇస్తావా..? లేదా అది చెప్పు అంటూ ఐశ్వర్య అడిగితే.. నువ్వు అడిగితే ఎంతైనా ఇస్తాను కానీ కారణం చెప్పు అంత డబ్బు ఎందుకు కారణం చెప్పు ఇస్తాను అనగానే.. ఐశ్వర్య కోపంగా ఇందును తిడుతుంది. రేఖ ఆంటీకి బుద్ది లేదు వంట చేసే నిన్ను తీసుకెళ్లి కంపెనీకి సీఈవోను చేసింది. నువ్వు ఆంటీకి ఏదో మాయ చేశావే అందుకే నిన్ను ఏమీ అనడం లేదు ఏదో ఒక రోజు నీ మాయలోంచి బయటకు వస్తే నీ ఆటలు సాగవు అంటూ బెదిరిస్తుంది. నేనేంటో నీకు త్వరలోనే చూపిస్తాను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది.

Advertisement

వెంకట్‌ ఆఫీసుకు వెళ్తుంటే.. నందు కాల్‌ చేస్తుంది. వెంకట్‌ లిఫ్ట్‌ చేయడు.. నందు కంటిన్యూగా కాల్‌ చేస్తూనే ఉంటుంది. వెంకట్‌ అదేమీ పట్టించుకోకుండా సారీ నందు నేను లిఫ్ట్ చేయను అనుకుంటూ వెళ్లి బైక్‌ స్టార్ట్‌ చేస్తూ.. ఎదురుగా ఉన్న నందును చూసి షాక్‌ అవుతాడు. నందు కోపంగా దగ్గరకు వెళ్తుంది. వెంకట్‌ నందు నువ్వా..? అనగానే.. నందు కోపంగా నా ఫోన్‌ ఎందుకు లిఫ్ట్‌ చేయడం లేదు.. ఇంటికి వచ్చినా పట్టించుకోవడం లేదు.. అసలు ఏమైంది నీకు ఎందుకు నాతో మాట్లాడట లేదు.. అసలు ఏం జరిగింది  అంటూ ప్రశ్నిస్తుంటే.. వెంకీ మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Today Episode : కేశవకు జాగారం.. మాధవ్ కు వార్నింగ్.. నిజం చక్రికీ తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు ప్లాన్.. కిడ్నాపర్స్ ఎంట్రీ.. పల్లవి దొరుకుతుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ విడిపోతారా..? రామరాజు నెక్స్ట్ ఏంటి..? శ్రీవల్లి అవుట్..

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Big Stories

Advertisement
×