E-Paper
Advertisement

హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ హైకమాండ్-కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ హైకమాండ్-కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
Advertisement

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు చేరుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక సాగునీటి ప్రాజెక్టులకు పూర్తిస్థాయి అనుమతులు సాధించడమే ప్రధాన ఎజెండాగా ఆయన ఈ పర్యటనను చేపట్టారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, రఘువీర్ రెడ్డి, బలరాం నాయక్ ఘన స్వాగతం పలికారు.

కేంద్ర మంత్రులతో ముఖ్యమైన సమావేశాలు

Advertisement

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నందున, సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఆవరణలోనే కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఉదయం 10:30 గంటలకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో సమావేశమవుతారు. తర్వాత ఉదయం 11:30 గంటలకు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అవుతారు.

సాగునీటి ప్రాజెక్టుల అనుమతులే ప్రధాన ఎజెండా

Advertisement

ఇటీవల సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయంలో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని సీఎం కోరనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు సమర్పించి, ప్రాజెక్టుల పురోగతికి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందించాలని విజ్ఞప్తి చేయనున్నారు.

కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ

కేంద్ర మంత్రులతో భేటీల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పాలనాపరమైన అంశాలు, ఇతర రాజకీయ పరిణామాలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు.

Tags

Related News

కేంద్ర జలశక్తి, పర్యావరణ మంత్రులతో రేవంత్ భేటీ.. తెలంగాణ ప్రాజెక్టులకి మోక్షం లభించేనా?

తెలంగాణ అమ్మాయిలకు బంపరాఫర్.. ఉచిత పైలట్ ట్రైనింగ్, ఇంకెందుకు ఆలస్యం

హైడ్రా బాస్ సంతకానికే ఎసరు.. ఏకంగా రంగనాథ్ పేరుతో నకిలీ NOCలు, 8 కాలేజీలపై కేసు!

మంత్రుల పేషీల్లో ‘షాడో’ లీడర్లు.. CCTV కెమెరాల్లో దొరికిపోయిన ‘పైరవీ’ నేతలు!

ఖమ్మంలో పోలీసుల మెరుపు దాడి.. 324 కిలోల గంజాయి సీజ్!

జీతాలైతే తీసుకుంటున్నారు.. ఆదాయమేది? ఐఏఎస్‌లపై సర్కార్ ఆగ్రహం!

ప్రభుత్వ జీతం.. సొంత వ్యాపారం.. టీచర్ల భాగోతంపై ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్!

పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. నియామక ప్రక్రియపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×